Mahesh Babu: మహేష్ బాబు రివ్యూలకి అంత డిమాండ్ ఉందా.. దర్శకుడి కామెంట్స్ వైరల్ !

‘మహేష్ బాబు (Mahesh Babu) జెన్యూన్ మూవీ లవర్’… ‘పుష్ప 2’ (Pushpa 2)  రిలీజ్ కి ముందు అల్లు అర్జున్ (Allu Arjun) చేసిన కామెంట్ ఇది. అల్లు అర్జున్ మాత్రమే కాదు అంతకు ముందు చాలా మంది స్టార్ హీరోలు ఈ మాట చెప్పారు. మిగిలిన హీరోలు తోటి హీరోల సినిమాలు చూసినా, చూడకపోయినా.. మహేష్ బాబు మాత్రం ప్రతి సినిమాను చూస్తుంటాడు. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా.. పక్క భాషల హీరోలకి సంబంధించిన సినిమా అయినా.. కచ్చితంగా చూడటమే కాకుండా..

Mahesh Babu

ఆ సినిమాకి సంబంధించిన మేకర్స్ ని ప్రశంసిస్తూ ట్వీట్లు వేస్తుంటాడు. మహేష్ ట్వీట్లు చాలా చిన్న సినిమాలకు హెల్ప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మహేష్ ట్వీట్ చేస్తే.. అతని అభిమానులు ఆ ట్వీట్ ను మరింతగా వైరల్ చేస్తుంటారు. వాళ్ళు సినిమా కూడా సినిమా చూస్తుంటారు. ఈ విషయాన్ని ఓ తమిళ దర్శకుడు ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు. విషయం ఏంటంటే.. ‘లవ్ టుడే’ (Love Today) హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan)  నటించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ (Return of the Dragon)  సినిమా ఇటీవల రిలీజ్ అయ్యింది. అది సూపర్ హిట్ అయ్యింది.. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు షేర్ ను రాబట్టింది.

దీంతో హైదరాబాద్లో ఓ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా దర్శకుడు అశ్వత్ మారిముత్తు (Ashwath Marimuthu) మాట్లాడుతూ… “నా ‘ఓ మై కడవలె’ సినిమా రిలీజ్ అయినప్పుడు. మహేష్ బాబు ఒక్క ట్వీట్ వేశారు. అంతే తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఆ సినిమాని చూశారు. అందుకే మహేష్ బాబు ట్వీట్ కోసం నేను వెయిటింగ్. ఈ విషయాన్ని మహేష్ బాబు (Mahesh Babu) వరకు తీసుకెళ్లండి. ‘ఆయన ఈ సినిమా చూడాలి. చూసి కచ్చితంగా ఆయన ప్రౌడ్ గా ఫీలవుతారు’ అని నేను నమ్ముతున్నాను.

ఈ మెసేజ్ మహేష్ గారు చూసేలా చేయండి” అంటూ చెప్పుకొచ్చాడు. అశ్వత్ కామెంట్స్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తున్న మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ రివ్యూలకి ఉండే డిమాండ్.. రేంజ్ ఎలాంటిదో ఓ వంద కోట్ల దర్శకుడు చెప్పడం పట్ల వాళ్ళు గర్వపడుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus