లవ్ స్టోరీ కోసం పోటీపడుతున్న ఓటిటి ప్లాట్ ఫార్మ్స్

  • June 28, 2020 / 12:06 PM IST

ఫిదా మూవీతో ఫుల్ ఫార్మ్ లోకి వచ్చాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరున్న శేఖర్ కమ్ముల సినిమాలు కుటుంబం అంతా కూర్చుని హ్యాపీగా చూడొచ్చు . లాక్ డౌన్ కారణంగా థియేటర్ లో సినిమా చూసే పరిస్థితి కూడా లేదాయే. అందుకే ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలకు డిమాండ్ పెరిగింది. కాగా తాజాగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో క్రేజీ కాంబినేషన్ నాగచైతన్య – బ్యూటీ సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా వస్తోన్న ‘లవ్ స్టోరీ’ కోసం డిజిటల్ ప్లాట్ ఫామ్స్ భారీగా పోటీపడుతున్నాయి.

ఫ్యాన్సీ ఆఫర్స్ తో ఈ మూవీ కోసం పోటీపడుతున్నాయి. డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం ఖాయం అని ఓ టి టి యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్ చైతూ గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలుకుతుంది. మొన్నటి వరకూ జీ5 పోటీలో ముందు ఉంది. ఇప్పుడు అమెజాన్ రేసులోకి వచ్చింది. అలాగే మరో ప్రముఖ యాప్ కూడా ఆసక్తి చూపుతుందని లవ్ స్టోరీలో భాగం అయిన ఓ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తి చెబుతున్న మాట.

సినిమా కాంబినేషన్ తో పాటు శేఖర్ కమ్ముల గత చిత్రం ఫిదా భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం కూడా లవ్ స్టోరికి బాగా కలిసి వచ్చాయి. దానికి తోడు క్రేజీ బ్యూటీ సాయి పల్లవి ఇందులో హీరోయిన్. చైతూతో ఆమె నటించడం ఇదే ప్రథమం కావడం, వీరి జోడీ పై ప్రేక్షకుల్లో బీభత్సమైన ఇంట్రస్ట్ ఉండటం సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus