Veera Simha Reddy: బాలయ్య సినిమాకి ప్లస్ అయిన ‘దునియా’ విజయ్..!

మన తెలుగు సినిమాల్లో ఇతర భాషా నటీనటులు కనిపించడం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలోని స్టార్స్, సీనియర్ హీరోలు టాలీవుడ్ లో నటించి ఇక్కడి ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. పర్సన్, చేసే క్యారెక్టర్ నచ్చితే తెలుగు ఆడియన్స్ కచ్చితంగా ఆదరిస్తారనే సంగతి తెలిసిందే..నటసింహ నందమూరి బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీర సింహా రెడ్డి’..

ఇటీవల విడుదల చేసిన టైటిల్ టీజర్ కి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. శృతి హాసన్ ఫస్ట్ టైం బాలయ్యతో జతకడుతోంది. అలాగే పాపులర్ మలయాళ నటుడు లాల్ కూడా ఇందులో నటిస్తున్నారు. ఇక కన్నడ స్టార్ హీరో, ‘దునియా’ విజయ్, బాలయ్య మూవీతో విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. కర్ణాటకలో విజయ్ కి మాస్ హీరోగా మంచి పేరు, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాలో ఆయన పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్నాడు.

విజయ్ నటించడం ‘వీర సింహా రెడ్డి’ కి ప్లస్ అయ్యిందనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. అతని కారణంగానే బాలయ్య సినిమాకి కన్నడలో భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం. బెంగుళూరు మొదలుకుని కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో బాలయ్యకు అభిమానులున్నారు. ఆయన సినిమాలు తెలుగుతో పాటు అక్కడ కూడా మంచి డిమాండ్ తో విడుదలవుతుంటాయి. అయితే ‘వీర సింహా రెడ్డి’ లో విజయ్ విలన్ గా నటిస్తుండడంతో ఈ మూవీపై అక్కడ కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

ఈ నేపథ్యంలో బాలయ్య గత చిత్రాలకంటే ఎక్కువగానే బిజినెస్ డీల్ క్లోజ్ చేశారట. పాపులర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫ్యాన్సీ రేటుకి రైట్స్ దక్కించుకుందని శాండల్ వుడ్ టాక్. విజయ్ క్రేజ్ ని బట్టి కన్నడలో ఈ చిత్రం అత్యధికంగా కలెక్షన్లు వసూలు చేసే అవకాశముందంటున్నారు. ఇటు బాలయ్య, అటు విజయ్ ఫ్యాన్స్ వచ్చే సంక్రాంతి కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus