NBK107: గోపీచంద్ మలినేని బాలయ్యకు అలాంటి హిట్ ఇస్తారా?

స్టార్ హీరో బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా నుంచి మరో రెండు రోజుల్లో టైటిల్ రివీల్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు జై బాలయ్య, రెడ్డిగారు అనే టైటిల్స్ లో ఒక టైటిల్ ఫిక్స్ కానుంది. ఈ రెండు టైటిల్స్ లో ఏ టైటిల్ ఫిక్స్ అయినా ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా ఫీలవుతారు.

ఈ సినిమా సాంగ్స్ విషయంలో కూడా థమన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. అఖండ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీకి రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది. అఖండ సక్సెస్ బాలయ్య కెరీర్ కు ప్లస్ కావడంతో ఈ సినిమాకు ఏకంగా 80 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని బోగట్టా. 2023 సంక్రాంతికి ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇతర సినిమాల నుంచి పోటీ ఉన్నా బాలయ్య మాత్రం సంక్రాంతి పోటీ విషయంలో వెనక్కు తగ్గకూడదని భావిస్తున్నారు. బాలయ్య సినీ కెరీర్ లో ఇప్పటివరకు ఏ సినిమా కూడా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి బాలయ్య ఫ్యాన్స్ కోరిక తీరుతుందో లేదో చూడాల్సి ఉంది.

లక్కీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలయ్య శృతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కాగా గతంలో ఎప్పుడూ చేయని తరహా పాత్రలో ఈ సినిమాలో శృతి హాసన్ కనిపించనున్నారని తెలుస్తోంది. బాలయ్య ఈ సినిమాలో ఒక పాత్రలో క్లాస్ గా మరో పాత్రలో ఊరమాస్ రోల్ లో కనిపించనున్నారు. బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus