Tamanna: తమన్నా పరువు తీసేసిన మాస్టర్ చెఫ్ షో నిర్వాహకులు..!

‘మాస్టర్ చెఫ్’ అనే షో మిగిలిన భాషల్లో బాగానే సక్సెస్ అయ్యింది.. కానీ తెలుగులో మాత్రం డిజాస్టర్ అయ్యింది. జెమినీలో ప్రసారమయ్యే ఈ షోని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా హోస్ట్ చేయడం జరిగింది. కానీ టి.ఆర్.పి రేటింగ్స్ మాత్రం ఘోరంగా నమోదయ్యాయి. దీంతో తమన్నాని తొలగించి…స్టార్ యాంకర్ అనసూయని పెట్టుకున్నారు నిర్వాహకులు.ఆ మాత్రం రేటింగ్ కు తమన్నా లాంటి స్టార్ హీరోయిన్ ను పెట్టుకుని ఎక్కువ ఖర్చు ఎందుకు… అనసూయతో చేయించుకుంటే సరిపోతుంది అనేది వారి అభిప్రాయం కావచ్చనే కథనాలు వినిపించాయి.

అయితే తమన్నాతో అగ్రిమెంట్ చేయించుకుని ఇప్పుడు మరొకరిని ఎలా తీసుకుంటారని ఆమె మాస్టర్ చెఫ్ నిర్వాహకులకి నోటీసులు పంపింది. దీని పై వారు ఓ ప్రెస్ నోట్ విడుదల చేస్తూ క్లారిటీ ఇచ్చారు. వారు ఈ విషయం పై స్పందిస్తూ.. “రూ. 2 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేలా తమన్నాతో అగ్రిమెంట్ చేసుకున్నాము. జూన్ 24 నుండీ సెప్టెంబర్ చివరి వరకు మొత్తం 18 రోజులు షోకు హోస్ట్ గా వ్యవహరించేందుకు గాను తమన్నాతో ఆమె అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అయితే ఆమె మిగిలిన ప్రాజెక్టుల వల్ల కేవలం 16 రోజులు మాత్రమే షూటింగ్ కు వచ్చింది.

రెండు రోజుల పాటు ఆమె హాజరుకాలేదు.ఈ 2 రోజుల వల్ల… 300 మంది టెక్నీషియన్లు పనిచేస్తున్న షోకి రూ. 5 కోట్లకు పైగా నష్టం వచ్చింది. అయితే ముందుగానే ఆమెకు రూ. 1.56 కోట్ల చెల్లించేశాము. రెండు రోజుల షూటింగ్ కు ఆమె రాకపోవడం వల్ల బ్యాలన్స్ పేమెంట్ చేయలేదు.మా అగ్రిమెంట్ ప్రకారం ఆమె షూటింగ్ పూర్తి చేయలేదు…కానీ సెకండ్ సీజన్ అడ్వాన్స్ కూడా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తుంది. నిజానికి ఆమెను సెకండ్ సీజన్ కు తీసుకునే ఉద్దేశం మాకు లేదు. తమన్నా అంశానికి సంబంధించి వార్తలు రాసేముందు మమ్మల్ని సంప్రదించి రాస్తే బాగుంటుంది” అంటూ వారు పేర్కొన్నారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus