ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎలాంటి సినిమాను తెరకెక్కించిన కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ బిజినెస్ చేసే విధంగా ఆయన ప్రణాళికలు రచిస్తుంటారు. సినిమా నిర్మించడం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత దాన్ని ఎలా మార్కెట్లోకి తీసుకు వెళ్ళాలి అనే విషయంలో దిల్ రాజు వేసే ప్రణాళికలు చాలా విభిన్నంగా ఉంటాయి. నైజాం ఏరియాలో థియేటర్స్ ను తన అధీనంలోనే ఉంచుకున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే.
Click Here To Watch NEW Trailer
ఏడాదిపాటు దిల్ రాజు వాటిని ప్రత్యేకంగా లీజుకు తీసుకొని తనకు నచ్చిన సినిమాలను విడుదల చేసిన లాభాలను అందుకుంటారు. నమ్మకం లేని సినిమాల విషయంలో మాత్రం ఆయన కాస్త దూరంగానే ఉంటారు. రాజమౌళి ప్రతి సినిమాను కూడా ఆయనే విడుదల చేస్తూ ఉంటారు. ఇక ఈ సారి RRR సినిమాను కూడా భారీ ధరకు కొనుగోలు చేసి విడుదల చేయబోతున్నారు. అయితే ఇంతకు ముందు విడుదల చేసిన రాధే శ్యామ్ సినిమాతో మాత్రం దిల్ రాజు భారీ స్థాయిలో నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఈ సినిమా తో దిల్ రాజు దాదాపు 20 కోట్ల వరకు నష్టపోయినట్లు సమాచారం. ఇక ఆ నష్టాలను పూరించడానికి RRR సినిమా పైనే గట్టి నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం దాదాపు 70 కోట్ల వరకు పెట్టుబడి పెట్టిన దిల్ రాజు డబుల్ ప్రాఫిట్స్ అందుకోవాలి అని చూస్తున్నాడు. ప్రస్తుతం నైజాం ఏరియాలో అయితే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. మొదటిరోజు ఈజీగా 25 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంటుంది అని సమాచారం.
ఇక ఈ సినిమాకు మరింత పాజిటివ్ టాక్ వస్తే ఈ వీక్ లోనే పెట్టిన పెట్టుబడి వెనక్కి రావచ్చు అని సమాచారం. టిక్కెట్ల రేట్లు పెరగడం కూడా దిల్ రాజుకు కాస్త కలిసొచ్చే అంశం. కానీ ఫ్యామిలి ఆడియెన్స్ కలిసి రావాలి అంటే రేట్లను చూసి భయపడుతున్నారు. మరి ఆ ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తుందో లేదో చూడాలి.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!