Drushyam 2: ‘దృశ్యం 2’ కి భారీ ఓటిటి ఆఫర్..నిర్మాతని కన్ఫ్యూజన్లో పడేశారే..!

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం’ ను తెలుగులో వెంకటేష్ రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.దర్శకురాలు శ్రీప్రియ ఈ రీమేక్ ను తెరకెక్కించారు. ఇక మలయాళంలో దానికి సీక్వెల్ ను కూడా రూపొందించాడు దర్శకుడు జీతూ జోసెఫ్. అయితే కరోనా కారణంగా ఓటిటిలోనే ఈ చిత్రాన్ని విడుదల చేశారు. దీనికి కూడా సూపర్ హిట్ టాక్ లభించింది.దాంతో తెలుగులో థియేటర్లు తెరుచుకున్న నేపథ్యంలో ‘దృశ్యం2’ ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చెయ్యాలి అనుకున్నారట.

కానీ వెంకటేష్, సురేష్ బాబు లు దర్శకుడిని సంప్రదించి తెలుగులో రీమేక్ చెయ్యడానికి రెడీ అయ్యారు. రెండు నెలలు పూర్తికాకుండానే ఈ చిత్రం షూటింగ్ ను కంప్లీట్ చేసేసారు. అయితే థియేటర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటే.. కరోనా మళ్ళీ పుంజుకుంటున్న నేపథ్యంలో ‘దృశ్యం2′(తెలుగు) ని కూడా ఓటిటిలో రిలీజ్ చెయ్యబోతున్నారు అంటూ వార్తలు మొదలయ్యాయి. కానీ వాటిలో నిజం లేదని.. థియేటర్లలో రిలీజ్ చెయ్యడం కోసమే ఈ సీక్వెల్ ను రూపొందించినట్టు సురేష్ బాబు చెప్పుకొచ్చారు.అంతేకాదు ఒరిజినల్ తో పోలిస్తే కొన్ని మార్పులు కూడా చేశారట.

ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్ ను థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది అని కూడా ఆయన అన్నారు. అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వారు ‘దృశ్యం 2’ ని ఓటిటిలో రిలీజ్ చెయ్యమని రూ.45కోట్ల ఆఫర్ ఇచ్చారట. దాంతో సురేష్ బాబు మళ్ళీ ఆలోచనలో పడినట్టు భోగట్టా..! నిజానికి ‘దృశ్యం2’ సినిమాని పారితోషికాలతో కలుపుకుని రూ.10 కోట్ల బడ్జెట్ లోపే ఫినిష్ చేశారట. కాబట్టి దీనికి ఓకే చెప్తే నిర్మాతలు భారీ లాభాలు అందుకున్నట్టే..! పైగా మే నెలలో ఎలాగూ థియేటర్లు తెరుచుకునే అవకాశం లేదని కొందరు సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి..!

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus