ఈ మధ్య కాలంలో కొంతమంది హీరోయిన్లు సైలెంట్ గా పుంజుకుంటున్నారు. వారిలో ‘జాంబీ రెడ్డి’ ఫేమ్ ‘ఆనంది’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్ వర్ష బొల్లమ్మ వంటి వారు ఉన్నారు. అంతేకాదు మధ్యలో సైలెంట్ అయిపోయిన రీతూ వర్మ కూడా ఈ మధ్యన వరుస ప్రాజెక్టుల్లో హీరోయిన్ గా నటిస్తూ బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ లిస్టులో ‘గద్దలకొండ గణేష్’ ఫేమ్ డింపుల్ హయతి కూడా చేరినట్టు స్పష్టమవుతుంది. నిజానికి ఈ చిత్రంలో ‘జర్రా జర్రా’ అనే ఓ పాటలో మాత్రమే ఈమె కనిపిస్తుంది.
అది కూడా ఐటెం సాంగ్ లాంటిదే..! అటు తరువాత ‘యురేక’ ‘గల్ఫ్’ వంటి చిన్న సినిమాల్లో నటించింది కానీ అవేమి సక్సెస్ అవ్వలేదు. అసలు ఆ సినిమాలు వచ్చినట్టు కూడా జనాలకు పెద్దగా తెలీదు. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ ఏకంగా రెండు బడా ప్రాజెక్టుల్లో ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అందులో ఒకటి.. రవితేజ హీరోగా రమేష్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘ఖిలాడి’ మూవీ కాగా మరొకటి విశాల్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ కావడం విశేషం.
అంటే ఈమె కోలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చేస్తుందన్న మాట. రవితేజ సినిమాలో ఈమె మెయిన్ హీరోయినో కాదో ఇంకా స్పష్టత రాలేదు కానీ.. విశాల్ సినిమాలో మాత్రం లీడ్ రోల్ పోషిస్తుంది. ఈ సినిమా కనుక హిట్ అయితే అక్కడ ఈమెకు మరిన్ని ఛాన్సులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోలీవుడ్లో హీరోయిన్ల కొరత చాలా ఉంది. కాబట్టి.. డింపుల్ కు ఈ ఛాన్స్ లను ఎంతవరకూ సద్వినియోగ పరుచుకుంటుందో చూడాలి..!
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!