NBK107: బాలయ్య మూవీకి కళ్లు చెదిరే ఆఫర్లు.. కానీ?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. బాలయ్య గత సినిమా అఖండ నైజాంలో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. ఫుల్ రన్ లో నైజాంలో అఖండ 22 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఏపీలో తక్కువ టికెట్ రేట్లు అమలులో ఉన్నా అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయ్యి ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా సక్సెస్ వల్ల బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీకి కళ్లు చెదిరే ఆఫర్లు వస్తున్నాయి.

ఈ సినిమా నైజాం హక్కులకు ఏకంగా 18 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీకి 18 కోట్ల రూపాయల ఆఫర్ అంటే తక్కువేం కాదు. మరోవైపు ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులకు కూడా ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది. ఈ సినిమాకు సంబంధించి సరైన రిలీజ్ డేట్ కోసం మేకర్స్ వెతుకుతున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ లోనే ఈ సినిమా రిలీజ్ కానుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

క్రాక్ సక్సెస్ తర్వాత గోపీచంద్ మలినేని అఖండ సక్సెస్ తర్వాత బాలయ్య నటించిన సినిమా కావడంతో ఈ సినిమాలపై ఊహించని స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాతో బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బాలయ్య సంచలన విజయాలను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సినిమాసినిమాకు బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుని బాలయ్య విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus