ఇప్పుడు సినిమాకి భాషతో సంబంధం లేదు. పైగా ఓటీటీల హవా పెరిగిన తర్వాత ప్రేక్షకులు అన్ని భాషల్లోని సినిమాలను సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తున్నారు. మన తెలుగు సినిమా అనే సరికి అన్ని భాషల్లోని ప్రేక్షకులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే పక్క భాషల్లోని నటీనటులకు కూడా తెలుగు సినిమాల్లో మంచి మంచి పాత్రలు లభిస్తున్నాయి. తమిళ సినీ పరిశ్రమకు చెందిన సముద్రఖని, విజయ్ సేతుపతి వంటి వాళ్లకి ఇక్కడ మంచి డిమాండ్ ఏర్పడింది.
అలాగే మలయాళ సినీ పరిశ్రమకు చెందిన నటీనటులకు కూడా ఇక్కడ మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ‘పుష్ప’ విలన్ ఫహాద్ ఫాజిల్ అయితే టాలీవుడ్ యంగ్ హీరోలతో సమానంగా పారితోషికం అందుకునే రేంజ్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. కాకపోతే అతను ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించడం లేదు. ‘అంటే సుందరానికీ!’ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నజ్రియా సైతం ఎక్కువ ఆఫర్లు పట్టలేకపోతుంది.
అయితే మరో మలయాళ నటుడు (Shine Tom Chacko) షైన్ టామ్ చాకో మాత్రం తెలుగులో మంచి ఆఫర్లు పడుతున్నాడు. దాదాపు 20 ఏళ్ల నుండి ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు. ‘దసరా’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా సక్సెస్ లో అత్యంత కీలక పాత్ర పోషించాడు. నాగ శౌర్య హీరోగా తెరకెక్కుతున్న ‘రంగబలి’ లో కూడా ఇతను విలన్ గా కనిపించనున్నాడు. అంతేకాదు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమాలో షైన్ టామ్ చాకో ఓ పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నాడట.
అయితే అది నెగిటివ్ రోల్ కాదు. హీరోకి అండగా.. ఓ ఆయుధంలా పనిచేసే రోల్ అని ఇన్సైడ్ వర్గాల సమాచారం. ఏదేమైనప్పటికీ.. కూడా షైన్ టామ్ చాకో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు అనేది స్పష్టమవుతుంది.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్