మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాల విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరుగా ఉన్నారు. రచయితగా కెరీర్ ను మొదలుపెట్టిన కొరటాల శివ పలు సినిమాలకు కథలు అందించడం గమనార్హం. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య మూవీ ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ కానుంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ లను దాటుకుని థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.
ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ కావడంతో ఆచార్య సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుండగా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ కూడా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనుంది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి కొరటాల శివపై విపరీతమైన ఒత్తిడి ఉందని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కోరుకున్న పాన్ ఇండియా ఇమేజ్ దక్కింది. అయితే తర్వాత సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తే మాత్రమే హీరోలకు ఈ పాన్ ఇండియా ఇమేజ్ కొనసాగుతుంది.
ప్రతి సినిమాలో అంతర్లీనంగా మెసేజ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకునే కొరటాల శివ తన సినిమాలో తారక్ ను పవర్ ఫుల్ గా చూపించడంతో పాటు కథ, కథనంతో మెప్పించాల్సి ఉంది. కొరటాల అంచనాలను అందుకోవడంలో ఏ మాత్రం పొరపాటు చేసినా సినిమా రిజల్ట్ పై ఆ ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే ఉంటాయి. కొరటాల శివ ఈ సినిమాలో తారక్ కు జోడీగా అలియా భట్ ను ఎంపిక చేశారు.
కొరటాల శివ సినిమాలలో నిడివితో సంబంధం లేకుండా హీరోయిన్లకు మంచి పాత్రలు దక్కుతాయి. హీరోయిన్ల పాత్రలను హుందాగా చూపించే అతికొద్ది మంది డైరెక్టర్లలో కొరటాల శివ కూడా ఒకరు. ఆచార్య సినిమాతో కొరటాల శివ పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకుంటారేమో చూడాలి. వరుస విజయాలతో కొరటాల శివ రెమ్యునరేషన్ కూడా ఊహించని స్థాయిలో పెరిగిందని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ రిలీజయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?