దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రాలు ఒకటా? రెండా? ఎన్నో రికార్డులను కొల్లగొట్టాయి. కలక్షన్స్ పరంగా అనేక రికార్డులను నెలకొల్పాయి. తాజగా ఈ సినిమాలు మరో రికార్డుని నమోదు చేశాయి. ప్రముఖ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సర్వీస్ నెట్‌ఫ్లిక్ ఈ చిత్రాల ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఆన్ లైన్ ప్రసార హక్కులు 25.50 కోట్లకు అమ్ముడుపోయి ఆశ్చర్య పరిచాయి. బాహుబలి 1, 2 సినిమాలను నెట్‌ఫ్లిక్ సంస్థ కొనుగోలు చేసింది.
దీంతో 192 దేశాల్లో ఈ చిత్రం ఆన్‌లైన్లో ప్రసారం కానుంది. దీంతో ఎప్పుడైనా బాహుబలిని చూడాలనుకుంటే నెట్లో చూసుకునే వీలు లభించింది. ఆమిర్ ఖాన్ నటించిన ‘దంగల్’ చిత్రం ఆన్‌లైన్ స్ట్రీమింగ్ హక్కులను కూడా నెట్‌ఫ్లిక్ సొంతం చేసుకుంది. రూ.20 కోట్లకు ‘దంగల్’ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.