మహేష్ బాబు తర్వాత ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉండేది నాని చిత్రాలకే అనడంలో అతిశయోక్తి లేదు. ‘ఈగ’ భలే భలే మగాడివోయ్’ ‘నేను లోకల్’ ‘నిన్నుకోరి’ ‘ఎం.సి.ఏ’ వంటి చిత్రాలతో 1 మిలియన్ క్లబ్ లో 5 సార్లు చేరాడు. ఇక ‘జెంటిల్ మెన్’ ‘కృష్ణ గాడి వీర ప్రేమగాధ’ ‘మజ్ను’ వంటి చిత్రాలతో హాఫ్ మిలియన్ డాలర్ల వసూళ్ళు కూడా రాబట్టాడు. విచిత్రం ఏమిటంటే ‘కృష్ణార్జున యుద్ధం’ ‘దేవదాస్’ వంటి ప్లాప్ చిత్రాలతో కూడా హాఫ్ మిలియన్ సాధించడం విశేషం. దీనిని బట్టి ఓవర్సీస్ లో నాని క్రేజ్ ఏంటనేది చెప్పొచ్చు. దీంతో నాని తాజా చిత్రం ‘జెర్సీ’ చిత్రానికి 4 కోట్ల భారీ రేటుకి అమ్ముడయ్యాయట. లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన బ్లూ స్కై సినిమాస్ ఈ హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికే విడుదలైన ‘జెర్సీ’ టీజర్ , ట్రైలర్లు ప్రామిసింగ్ గా ఉండడం క్రికెట్ నేపథ్యంలో రానున్న చిత్రం కావడం.. అందులోనూ ఇది ఐపియల్ సీజన్ కావడంతో.. ‘జెర్సీ’ చిత్రానికి ఓవర్సీస్ లో కూడా మంచి హైప్ ఏర్పడింది. ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా జెర్సీ చిత్రానికి అక్కడ మంచి కలెక్షన్లు రావడం ఖాయం అనడంలో సందేహం లేదు.‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ‘జెర్సీ’ చిత్రాన్ని ‘సితార ఎంటెర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించాడు. అనిరుధ్ సంగీతమందించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదలకాబోతుంది. మరి ఈ చిత్రం ఏ స్థాయి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి..!