Silk Smitha: సిల్క్ స్మిత కొరికిన యాపిల్… వేలంపాటలో అదిరిపోయే ధర!

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రెండు యాపిల్స్‌ గురించే మాట్లాడుతున్నారు. యాపిల్‌ 15 సిరీస్‌ ఒకటైతే, రెండో సిల్క్‌ స్మిత యాపిల్‌. అవును చదివింది కరెక్టే. టెక్‌ ప్రియులు యాపిల్‌ 15 సిరీస్‌ మొబైల్స్‌ గురించి మాట్లాడుతుంటే… సినిమా అభిమానులు గతంలో సిల్క్‌ స్మిత కొరికి వదిలేసిన యాపిల్‌ గురించి చర్చ పెడుతున్నారు. ఎందుకంటే ఆ యాపిల్‌కు వేలంలో అంత భారీ ధర వచ్చింది కాబట్టి. ఇందులో నిజాలు తెలియవు కానీ… పుకార్లు అయితే బలంగా ఉన్నాయి.

సెలబ్రిటీల ఉపయోగించే వస్తువులకు బ్రాండ్‌ వాల్యూ భారీగా ఉంటుంది. అందుకే వాళ్లు వాడిన వస్తువులను వేలం వేసి భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తుంటారు. తాజాగా ఇలా సిల్క్‌ స్మిత కొరికిన యాపిల్‌ పండును వేలం వేశారు. బోల్డ్ పాత్రలు, బోల్డ్‌ సినిమాలకు ఒకప్పుడు ఫస్ట్ ఆప్షన్‌గా అనుకున్న సిల్క్‌ అనుకోని పరిస్థితుల్లో కన్నుమూసింది. అయితే ఆమె ఇక లేరు అనే విషయం ఎంతోమందికి చేదు వార్తే. అలాంటి సిల్క్‌ కొరికిన యాపిల్‌ అంటే ఎంత ధర పలకొచ్చు చెప్పండి.

సిల్క్ స్మిత (Silk Smitha) ఓ సినిమా షూటింగ్‌ బ్రేక్ సమయంలో యాపిల్‌ తినే ప్రయత్నం చేశారట. అయితే షాట్ రెడీ అవ్వడంతో కొరికిన యాపిల్‌ను అక్కడ పెట్టేసి తను వెళ్లిపోయారట. ఆ యాపిల్‌ను తీసుకొని ఓ వ్యక్తి పారిపోయాడట. ఆ తర్వాత ఆ యాపిల్‌కు వేలంపాట నిర్వహించాడు. అలా ఆ యాపిల్‌కు రూ. లక్ష వరకు పాట వచ్చిందని అంటున్నారు. ఇందులో నిజానిజాలు తెలియవు కానీ వార్త అయితే ఫుల్‌ స్వింగ్‌లో వైరల్ అవుతోంది.

తెలుగు కుటుంబంలో విజయలక్ష్మి వడ్లపాటిగా పుట్టి.. ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లి సిల్క్ స్మిత అయ్యింది. అలా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమాల్లో సిల్క్ స్మిత స్టార్‌ యాక్టర్‌ అయిపోయింది. అయితే వ్యక్తిగత జీవితంలోని కొన్ని సమస్యలు సిల్క్ జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఆ తర్వాత అవే ఆమె మరణానికి కారణం అయ్యాయి అంటారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus