Dil Raju: దిల్ రాజుకి అంతిచ్చారా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈరోజు నుండే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మొదట సినిమా విడుదలైన 56 రోజుల తరువాత నుండి స్ట్రీమింగ్ చేసుకునేలా.. అమెజాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు దిల్ రాజు.

కానీ కరోనా కారణంగా ‘వకీల్ సాబ్’ సినిమాకి కలెక్షన్స్ తగ్గిపోవడంతో 21 రోజులకే అమెజాన్ ప్రైమ్ లో సినిమాను స్ట్రీమింగ్ చేసుకోవడానికి దిల్ రాజు అంగీకరించారు. అయితే ఇలా ఎర్లీగా స్ట్రీమింగ్ చేస్తున్నందుకు గాను దిల్ రాజుకి రూ.12 కోట్ల లాభమని సమాచారం. మొదట దిల్ రాజు రూ.14 కోట్లకు సినిమా డిజిటల్ హక్కులను ఆమెజాను అమ్మేశారు. కానీ ‘వకీల్ సాబ్’ సినిమా థియేట్రికల్ రన్ వేగంగా ముగియడంతో అమెజాన్ ప్రైమ్ మరో రూ.12 కోట్లు చెల్లించి.. సినిమాను కాస్త ముందుగా స్ట్రీమింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.

దిల్ రాజు ఈ విషయాన్ని ముందుగా డిస్ట్రిబ్యూటర్లకు చెప్పి ఆ తరువాత డిజిటల్ డీల్ కు ఓకే చెప్పారని సమాచారం. అయితే ఒక స్టార్ హీరో సినిమాను మూడు వారాలకే ఓటీటీలో రిలీజ్ చేయడంపై కొందరి నుండి వ్యక్తమవుతోంది. ఈ విధంగా చేయడం వలన జనాలు థియేటర్లకు రావడం మానేసే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్నాడు. అలానే మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో కూడా నటిస్తున్నాడు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus