శర్వానంద్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోగా కిషోర్.బి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీకారం’. ’14 రీల్స్ ప్లస్’ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట కలిసి నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదల అయ్యింది. సినిమాకు పాజిటివ్ టాకే వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం నమోదు కాలేదు. ‘జాతి రత్నాలు’ వంటి క్రేజీ సినిమా పోటీగా ఉండడం.. అలాగే ‘శ్రీకారం’ టికెట్ రేట్లు పెంచెయ్యడం వంటివి సినిమా బాక్సాఫీస్ ఫలితాన్ని దెబ్బ తీశాయని చెప్పాలి.
అంతేకాకుండా గతంలో ‘మహర్షి’ చిత్రం కూడా ఇదే థీమ్ తో రూపొందడం..’శ్రీకారం’ టీజర్, ట్రైలర్లలో ఆ సినిమా పోలికలు కనబడడంతో ఈ సినిమా పై నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ మధ్యనే ఈ చిత్రం ఓటిటి లో విడుదలయ్యింది. ఇక్కడ మాత్రం ఈ సినిమాకి మంచి స్పందన లభించింది. ‘జాతి రత్నాలు’ మూవీ పోటీ ఇక్కడ కూడా ఉన్నప్పటికీ.. ‘శ్రీకారం’ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడం విశేషం. సన్ నెక్స్ట్ ఓటిటిలో ఈ చిత్రం విడుదలయ్యింది.
తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకూ సన్ నెక్స్ట్ లో విడుదలైన చిత్రాల్లో ‘శ్రీకారం’ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుందట. డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన సన్ నెక్స్ట్ వారు లాభాలు కూడా ఆర్జించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని రైతులు పంటను ఎలా పండించాలో ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో దర్శకుడు ఈ చిత్రంలో చాలా చక్కగా చూపించాడు.