Jenda Pai Kapiraju: ‘వైరల్లీ’ వారి ‘జెండా పై కపిరాజు’ వెబ్ సిరీస్ కు సూపర్ రెస్పాన్స్!

ప్రేక్షకులకు నిత్యం సరికొత్త కంటెంట్ ను అందిస్తూ.. ఆనందింపజేస్తుంది ‘తమడ మీడియా’ సంస్థ. మంచి కంటెంట్ ను ప్రేక్షకులకు అందించడానికి ఎప్పుడూ ముందుంటుంది ఈ సంస్థ. టాలెంట్ ఎక్కడున్నా.. ఎంకరేజ్ చేయడానికి ఈ సంస్థ సందేహించదు. ఎన్ని ఓటీటీ సంస్థలు వచ్చినా.. అందులో ఎన్ని వెబ్ సిరీస్ లు, కొత్త సినిమాలు వచ్చినా.. ‘తమడ మీడియా’ వారి ‘వైరల్లీ’ ఛానల్ లో స్ట్రీమింగ్ అయ్యే వెబ్ సిరీస్ లకు విపరీతమైన క్రేజ్ నెలకొంటుంది అనడంతో ఎటువంటి అతిశయోక్తి అనిపించుకోదు.

‘వైరల్లీ’ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లలో నటించే వారు ఇప్పుడు సినిమాల్లో బిజీగా రాణిస్తున్న సందర్భాలు కూడా చూస్తూనే ఉన్నాం. ప్రతివారం పదుల సంఖ్యలో కంటెంట్ ను ప్రేక్షకులకు అందిస్తుంటుంది ఈ సంస్థ. ఇటీవల ‘వైరల్లీ’ ఛానల్ లో ‘జెండా పై కపిరాజు’ (Jenda Pai Kapiraju) అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. చరణ్ పోతురెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ను శ్రీనివాసరావు, శివ శైలేంద్ర కలిసి నిర్మించారు.

ఆధ్యంతం వినోదాత్మకంగా సాగే సన్నివేశాలతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ఆల్రెడీ 2 ఎపిసోడ్లు రిలీజ్ అవ్వగా.. రెండిటికీ కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా కార్తీక్ పుబాక రాసిన డైలాగ్స్ హిలేరియస్ గా అనిపించాయి. కేదర్నాథ్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. విజువల్స్ అన్నీ చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఎపిసోడ్లను మీరు కూడా ఓ లుక్కేయండి :

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus