వీరయ్య, వీరసింహా టికెట్ రేట్ల పెంపు.. ఎంతంటే?

సంక్రాంతి పండుగ కానుకగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు తెరక్కుతుండగా ఈ రెండు సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 45 రూపాయలు + జీఎస్టీ పెంచుకునే విధంగా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో ప్రభుత్వం నుంచి ఈ అనుమతులు లభించాయి. అయితే అదనపు షోలకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చి ఉంటే బాగుండేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టికెట్ రేట్ల పెంపు వల్ల ఈ రెండు సినిమాలు ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తాయని చెప్పవచ్చు. టాక్ పాజిటివ్ గా వస్తే మాత్రం ఈ రెండు సినిమాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే పండుగ తర్వాత మాత్రం టికెట్ రేట్లను తగ్గిస్తే మంచిది. టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల సినిమాలను చూడాలని భావించే ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. టికెట్ రేట్ల పెంపు వల్ల కొన్ని సినిమాలకు లాభం కలిగితే మరికొన్ని సినిమాలకు నష్టం కలిగింది.

అయితే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు టికెట్ రేట్ల పెంపు వల్ల మేలు జరుగుతుందో నష్టం కలుగుతుందో చూడాల్సి ఉంది. మరోవైపు రేపు తెగింపు, వారిసు సినిమాల టాక్ తెలియనుంది. తమిళంలో రెండు సినిమాలు దాదాపుగా సమాన స్థాయిలో థియేటర్లలో విడుదలవుతున్నాయి. అయితే ఏ సినిమాకు హిట్ టాక్ వస్తుందో ఆ సినిమాకు స్క్రీన్ల సంఖ్య పెరగనుంది.

వారసుడు, తెగింపు సినిమాలు తెలుగు రాష్ట్రాలలో ఎన్ని థియేటర్లలో విడుదలవుతాయో క్లారిటీ రావాల్సి ఉంది. సంక్రాంతి సినిమాలు అంచనాలకు మించి సక్సెస్ సాధించి ప్రేక్షకులను మెప్పించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus