ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలు ఏ స్థాయిలో సక్సెస్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలలో చిన్న పాత్రలో కనిపించినా తన పాత్రతో ప్రశంసలు పొందిన నటీమణులలో మాళవిక అవినాష్ ఒకరు కావడం గమనార్హం. మాళవిక ఆధార్ కార్డ్ ను దుర్వినియోగం చేసి సైబర్ నేరగాళ్లు ఒక సిమ్ కార్డును కొనుగోలు చేశారు. ఆ సిమ్ కార్డ్ తో ముంబైలోని శ్రీమంతులకు ఫోన్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు మాళవిక పేరుపై సిమ్ కార్డ్ ఉన్నట్టు గుర్తించారు. ఆమెను పోలీసులు వీడియో కాల్ ద్వారా సంప్రదించడంతో పాటు ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయినట్టు సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేయాలని సూచించారు. మాళవిక ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఆమె ఫ్యాన్స్ ను సైతం ఎంతగానో బాధ పెడుతోందని సమాచారం అందుతోంది.
కేజీఎఫ్ నటి రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో ఉందని తెలుస్తోంది. కేజీఎఫ్ నటి మాళవికకు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారని సమాచారం అందుతోంది. తన ఆధార్ కార్డ్ దుర్వినియోగం కావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆమె చెబుతున్నారు. ఆమె పేరుపై అక్రమంగా జారీ అయిన సిమ్ కార్డ్ ను రద్దు చేశారని తెలుస్తోంది. అవినాష్ స్టేట్ మెంట్ ను పోలీసులు దాఖలు చేశారని భోగట్టా.
ఆధార్ సమాచారం లీకేజ్ విషయంలో ఆమె ఆందోళన వ్యక్తం చేసున్నారు. (Malavika) మాళవిక అవినాష్ ఇలాంటి పొరపాట్లు జరగకుండా రాబోయే రోజుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైరల్ అవుతున్న వార్తలు మాళవిక ఫ్యాన్స్ ను ఒకింత కలవరపెట్టాయి. మాళవిక తెలుగు ప్రాజెక్ట్ లతో కూడా బిజీ కావాలని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు. మాళవికకు భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.