Prabhas: సలార్ విషయంలో ప్రభాస్ అభిమానులకు షాక్ తగలనుందా.. ఏమైందంటే?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సలార్ మూవీ ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగష్టు నెలలో సలార్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ వారం సలార్ ట్రైలర్ రిలీజయ్యే అవకాశాలు అయితే లేవని తెలుస్తోంది. సెప్టెంబర్ నెల మొదటివారంలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. సలార్ విషయంలో ప్రభాస్ అభిమానులకు షాక్ తగలనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా శృతి హాసన్ ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ పూర్తి చేశారు. సినిమా రిలీజ్ కు నెల రోజుల సమయం మాత్రమే ఉన్నా ఈ సినిమాలోని శృతి పాత్రకు సంబంధించి అప్ డేట్ రాలేదనే సంగతి తెలిసిందే. ట్రైలర్ లో అయినా శృతి హాసన్ కు ప్రాధాన్యత ఉంటుందో లేదో చూడాల్సి ఉంది. సలార్ ట్రైలర్ ఆలస్యంపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ప్రభాస్ (Prabhas) సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్న తరుణంలో ప్రమోషన్స్ విషయంలో ఈ తప్పులు చేయవద్దని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండటం గమనార్హం. సలార్ మూవీ రెండో భాగం ఎప్పుడు విడుదలవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

సలార్1, సలార్2 సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. సలార్ సినిమాకు యాక్షన్ సీన్లు హైలెట్ గా నిలవనున్నాయని ఈ యాక్షన్ సీన్లు స్పెషల్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. సలార్ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సలార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటం గమనార్హం. శృతి హాసన్ ఈ సినిమాలో ఆద్య అనే పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus