‘పుష్ప’ టీంకు ఆ విషయంలో పెద్ద చిక్కొచ్చి పడిందే..!

ఈ ఏడాది ‘అల వైకుంఠపురంలో’ చిత్రంతో తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం 2020వ సంవత్సరానికి గాను సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇక ఈ చిత్రం హిట్ ఇచ్చిన ఊపులో..తన తరువాతి చిత్రాన్ని సుకుమార్ డైరెక్షన్లో చెయ్యడానికి ఓకే చెప్పాడు అల్లు అర్జున్. ‘పుష్ప’ టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రానికి ‘మైత్రీ మూవీ మేకర్స్’ వారు నిర్మాతలు. రష్మిక మందన హీరోయిన్ గా నటించబోతున్న ఈ చిత్రం షూటింగ్ నిజానికి ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది.

కానీ కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల ప్రారంభంకాలేదు. ఇదిలా ఉండగా.. ‘పుష్ప’ మూవీలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా.. గంధపు చక్కలు స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో విలన్ గా మొదట తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకున్నాడు. అప్పటి నుండీ ఆ పాత్రకోసం ఎవరిని ఎంపిక చేసుకోవాలా అనే డైలమాలో పడ్డారు చిత్ర యూనిట్ సభ్యులు.

ఈ క్రమంలో ఆది పినిశెట్టి, నారా రోహిత్, బాబీ సింహా వంటి వార్ల పేర్లు వినిపించాయి.మధ్యలో తమిళ్ హీరో ఆర్య ను కూడా సంప్రదించారని టాక్. కానీ ఎవ్వరూ ఫైనల్ కాలేదట. ఈ విషయం పై సుకుమార్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నట్టు సమాచారం. అయితే నవంబర్ 5 నుండీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంభంకానుందని ప్రచారం నడుస్తుంది.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus