Prabhas, Maruti: షాకింగ్ బడ్జెట్ తో వీఎఫ్ఎక్స్ వర్క్.. మారుతి తగ్గట్లేదుగా!

ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇదొక హారర్ కామెడీ ఫిలిం అని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ తన కెరీర్ లో తొలిసారి హారర్ జోనర్ లో సినిమా చేస్తున్నారు. అందుకే ఈ సినిమా ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

మారుతి డైరెక్టర్ అనేసరికి వారిలో ఆందోళన మరింత ఎక్కువైంది. అయితే అలాంటి భయాలు పెట్టుకోవసరం లేదని అంటున్నారు. భారీ బడ్జెట్ తో, పేరున్న హీరోయిన్లతో మారుతి ఈ సినిమా చేస్తున్నారు. వీఎఫ్ఎక్స్ కోసం భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. దాదాపు రూ.80 కోట్లు గ్రాఫిక్స్ కోసం ఖర్చు పెడుతున్నారట. ఘోస్ట్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో అసలు రాజీ పడకూడదని చిత్రబృందం నిర్ణయించుకుంది. ‘ఆదిపురుష్’ వీఎఫ్ఎక్స్ విషయంలో వచ్చిన ట్రోల్స్ ను దృష్టిలో పెట్టుకొని..

అలాంటి మిస్టేక్స్ చేయకూడదని అనుకుంటున్నారు. ప్రభాస్ కూడా వీఎఫ్ఎక్స్ విషయంలో కేర్ తీసుకోమని చెప్పారట. ఒక్క వీఎఫ్ఎక్స్ కోసమే ఎనభై కోట్ల బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందేమో చూడాలి. ఇక ఈ సినిమా రెండో షెడ్యూల్ డిసెంబర్ 8 నుంచి మొదలుకానుంది. ఈ షెడ్యూల్ లో హీరో జాయిన్ అవుతారని సమాచారం. క్రిస్మస్ ముందు వరకు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో ఒకరు నిధి అగర్వాల్ కాగా.. మరొకరు మాళవికా మోహనన్. మూడో హీరోయిన్ గా రిద్ధి కుమార్ ను తీసుకున్నారు. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమాలో రిద్ధి ఒక చిన్న పాత్రలో కనిపించింది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus