OG Movie: సినిమా షూట్‌ ఎప్పుడో తెలియదు.. మిగిలిన పనులు పూర్తవుతున్నాయిగా..

‘జైలర్‌’ (Jailer) సినిమా పేరు చెప్పగానే తొలుత రజనీకాంత్ (Rajinikanth) పేరు గుర్తొస్తుంది. ఆ వెంటనే ‘హుకుం’ అనే పేరే వినిపిస్తుంది. ఎందుకంటే సినిమా పేరుతో సమానంగా ఆ పేరు కూడా ప్రాచుర్యంలోకి వెళ్లింది కాబట్టి. సినిమా ప్రచారంలో ఆ పదానిది, ఆ పాటది ప్రత్యేక స్థానం. సినిమా గురించి ఎక్కడ ఎవరు మాట్లాడినా, చెప్పినా ఆ పాటను కచ్చితంగా ప్లే చేశారు. అంతెందుకు సినిమా రెండో పార్టుకు ఆ పేరే అంటున్నారు కూడా.

OG Movie

ఇప్పుడు ఆ సినిమా గురించి, ఆ పాట గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఆ పాటను తమిళంలో రాసిన రచయిత సూపర్‌ సుబ్బు గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ఆయన తాజాగా పవన్‌ కల్యాణ్‌  (Pawan Kalyan)  సినిమాకు పని చేశారట. అయిత అది తమిళ వెర్షన్‌ కోసమే అంటున్నారు. పవన్ కల్యాణ్‌ – సుజీత్‌  (Sujeeth)  కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అదే ‘ఓజీ’ (OG Movie). అందులోనే సూపర్‌ సుబ్బు భాగమయ్యారట.

తమన్‌ (S.S.Thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయట. సినిమా షూటింగ్‌ త్వరలో ఉంటుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో మ్యూజిక్‌ పనులు పూర్తి చేసే పనిలో పడ్డారట తమన్‌. ఇటీవల పాటల రికార్డింగ్‌ కూడా పూర్తి చేశారట. అందులో ఓ పాటను సూపర్‌ సుబ్బు రాశారట. ఆయన ఇప్పటివరకు చాలా తమిళ సినిమాలకు పాటలు రాశారు. అన్నీ మాంచిజోష్‌ మీదుండేవే. కాబట్టి ఇప్పుడు ‘ఓజీ’ (OG Movie) లోనూ అలాంటి పాటే చూస్తాం అంటున్నారు.

అయితే, సూపర్‌ సుబ్బు రాసిన పాట ‘హంగ్రీ చీతా’ తమిళ వెర్షన్‌ అని తెలుస్తోంది. ఇప్పటికే ఆ పాట ట్రాక్‌ రిలీజ్‌ చేశారు కూడా. మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ యాప్‌ల వివరాల ప్రకారం అయితే ఆ పాటను సుబ్బు రాసినట్లే తెలుస్తోంది. అయితే ఇదే పాటనా, లేక వేరే పాట కూడా రాశారా అనేది తెలియాల్సి ఉంది. ఏదైతేనేం తమన్‌ నుండి ‘హుకుం’ లాంటి పాట రాబోతోంది అన్నమాట.

100 రోజుల పాటు అండర్ వాటర్లో.. ‘దేవర’ టీం పడ్డ కష్టం అలాంటిది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus