Sunny Leone: నువ్వు నాపై నిఘా పెట్టావా అంటూ సన్నీని ప్రశ్నించిన భర్త!

ఒక పోర్న్ స్టార్ సినిమా రంగంలో సక్సెస్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. అడల్ట్ కంటెంట్ చిత్రాలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. 2012లో సన్నీ లియోన్ బాలీవుడ్ లో అడుగుపెట్టారు. అనూహ్యంగా బాలీవుడ్ లో నిలదొక్కుకుంది. సన్నీ లియోన్ కి ఫేమ్ ఫాలోయింగ్ ఏర్పడింది. గత దశాబ్ద కాలంగా సన్నీ లియోన్ పలు భాషల్లో చిత్రాలు చేస్తుంది. మంచు మనోజ్ ఆమెను టాలీవుడ్ కి పరిచయం చేశాడు. 2014లో విడుదలైన కరెంటు తీగ మూవీలో సన్నీ లియోన్ గెస్ట్ రోల్ చేసింది. సెక్సీ టీచర్ రోల్ లో టెంపరేచర్ పెంచేసింది.

తర్వాత రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ గరుడవేగ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ప్రస్తుతం సన్నీ లియోన్ కి సౌత్ ఇండియాలో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. సన్నీ లియోన్ గత ఏడాది జిన్నా చిత్రంతో పలకరించింది. ఈ మూవీలో ఆమె పూర్తి స్థాయి రోల్ చేశారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో అదరగొట్టింది. జిన్నా మూవీలో సన్నీ చేసిన ‘జారు మిఠాయి’ సాంగ్ అత్యంత ఆదరణ పొందింది. ప్రస్తుతం సన్నీ లియోన్ తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో కలిపి అరడజను వరకు చేస్తుంది.

భర్త డానియల్ వెబర్ తో పాటు సన్నీ లియోన్ ముంబైలో సెటిల్ అయ్యింది. తాజాగా ఆమె భర్త మీద మోసం చేస్తున్నాడంటూ ఆరోపణలు చేసింది. ఒక వీడియో కూడా షేర్ చేసింది. అయితే ఇదంత సీరియస్ మేటర్ కాదులెండి. తనకు తెలియకుండా భర్త డానియల్ ఐస్ క్రీం తింటున్నాడని సన్నీ లియోన్ ఆరోపించింది. కిచెన్ లో ఫ్రిజ్ దగ్గర ఉన్న డానియల్ హాల్ లో ఉన్న సన్నీ లియోన్ కి అద్దంలో కనిపిస్తున్నాడు.

డానియల్ దొంగచాటుగా ఐస్ క్రీమ్ తినడం విండో అద్దంలో సన్నీ లియోన్ చూసింది. అసలు ఏం చెబుతాడో చూద్దామని…. అక్కడ ఏం చేస్తున్నావ్? అని అడిగింది. వాటర్ తాగుతున్నానని డానియల్ సమాధానం చెప్పాడు. నేను విండో అద్దంలో నిన్ను చూశాను. నువ్వు ఐస్ క్రీం తింటున్నావ్ అని సన్నీ లియోన్ అనడంతో షాక్ అయ్యాడు. బయటకు వచ్చి నువ్వు నా మీద నిఘా పెట్టావా? అని డానియల్ సన్నీ లియోన్ ని ప్రశ్నించాడు. ఈ ఫన్నీ చీటింగ్ వీడియో వైరల్ అవుతుంది. (Sunny Leone) సన్నీ లియోన్ కి ముగ్గురు పిల్లలు కాగా అందులో ఒక అమ్మాయి అడాప్టెడ్.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus