Manchu Manoj Car: మంచు మనోజ్ కు షాక్ ఇచ్చిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..!

సామాన్యులు అయినా సెలబ్రిటీలు అయినా తగ్గేదే లె అంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఈ మధ్యకాలంలో వారు వరుసగా సినీ హీరోల కార్లను ఆపి సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ కారుని ఆపి తనిఖీలు నిర్వహించి ఆయన కార్ అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించి 700 ఫైన్ విధించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్, అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కార్ల పై కూడా ఇదే విధంగా సోదాలు నిర్వహించారు.

Click Here To Watch NOW

వాళ్లకు కూడా జరిమానా విధించారు. అయితే ఆ సమయంలో ఆ హీరోలు కార్లలో లేరు. ఇదిలా ఉండగా… తాజాగా ఈ లిస్ట్ లోకి మంచు మనోజ్ కూడా వచ్చి చేరారు. మెహదీ పట్టణం టోలి చౌకి వైపుగా ప్రయాణిస్తున్న మంచు మనోజ్ కారుని (AP 39 HY 03 19) ఆపి తనిఖీలు నిర్వహించారు అక్కడి ట్రాఫిక్ పోలీసులు. ఈ క్రమంలో మనోజ్ కారుకి అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించి ఆయనకి రూ.700 జరిమానా విధించారు.

ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది. వై కాటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మాత్రమే వీటిని ఉపయోగించేందుకు అర్హులు.మిగతా వారు ఉపయోగించకూడదని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కార్లు ఎక్కడ కనిపించినా వారు ఉపేక్షించకుండా సోదాలు నిర్వహిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus