Mahesh Babu: హైదరాబాద్‌లో స్టార్ బ్యూటీ.. మహేష్ ప్రాజెక్ట్ కోసమేనా?

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లో అడుగుపెట్టడంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్ గా మారింది. మహేష్ బాబు (Mahesh Babu)-ఎస్.ఎస్. రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్‌లో రూపొందుతోన్న SSMB29 ప్రాజెక్ట్ ఇటీవల పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యింది. దీంతో ఈ నేపథ్యంతో ప్రియాంక (Priyanka Chopra) రావడం వల్ల ఊహాగానాలు పెరుగుతున్నాయి. రాజమౌళి మూవీపై భారీ అంచనాలు ఉన్న తరుణంలో, ప్రియాంక నగరంలో కనిపించడంతో ఈ చిత్రానికి సంబంధం ఉందేమోనని ఫ్యాన్స్ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ప్రియాంక లాస్ ఏంజిల్స్ నుంచి హైదరాబాద్‌ చేరుకోవడం, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Mahesh Babu

మహేష్ బాబు (Mahesh Babu) సినిమాకు కథానాయికగా నటించనుందనే వార్తలు ఇప్పటికే చక్కర్లు కొడుతుండగా, లుక్ టెస్ట్ లేదా స్క్రిప్ట్ డిస్కషన్ కోసం అయి ఉండొచ్చని అంటున్నారు. కానీ ఇప్పటివరకు దీనిపై అధికారిక సమాచారం మాత్రం వెలువడలేదు. ప్రియాంక గతంలో రామ్ చరణ్ (Ram Charan) ‘తుఫాన్’ (జంజీర్) (Zanjeer) చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నించింది. కానీ ఆ చిత్రం పెద్దగా ఆడకపోవడంతో దక్షిణాదికి దూరంగా ఉండిపోయింది.

ఈ గ్యాప్ తర్వాత, మరింత వైవిధ్యమైన పాత్రతో సౌత్‌లో తన సత్తా చూపాలని భావించిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా SSMB29 చిత్రం గ్లోబల్ వైడ్ హైప్ ఉండటంతో, ప్రియాంక ఈ ప్రాజెక్ట్‌తో మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలని చూస్తోందని తెలుస్తోంది. ఇక SSMB29 గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, ఇది మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం.

రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి దుర్గా ఆర్ట్స్‌తో పాటు ఓ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ కూడా భాగస్వామ్యమవుతుందని సమాచారం. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ప్రియాంకతో పాటు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

‘సంక్రాంతికి వస్తున్నాం’ చైల్డ్ ఆర్టిస్ట్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus