Hyper Aadi: హైపర్ ఆది ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా?

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన హైపర్ ఆది ఒకవైపు రియాలిటీ షోలలో చేస్తూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తున్నారు. బుల్లితెరపై భారీ పారితోషికం అందుకుంటున్న కమెడియన్లలో హైపర్ ఆది ఒకరు కావడం గమనార్హం. రియాలిటీ షోల ద్వారా సంపాదించిన డబ్బుతో హైపర్ ఆది సొంతూరిలో పొలాలు కొనుగోలు చేశారు. హైపర్ ఆదికి హైదరాబాద్ లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆస్తులు ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆది యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.

తనపై ఏవైనా రూమర్లు ప్రచారంలోకి వస్తే వాటి గురించి వేగంగా క్లారిటీ ఇచ్చే విషయంలో హైపర్ ఆది ముందువరసలో ఉంటారు. తాజాగా ఈ నెల 24వ తేదీన ప్రసారం కానున్న ఢీ 14 ప్రోమో విడుదలైంది. లవ్ థీమ్ తో విడుదలైన ఈ ప్రోమోలో కంటెస్టెంట్ల డ్యాన్స్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ప్రోమోలో నేను ఎనిమిదో తరగతి వరకు మా ఊరిలోనే గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్నానని ఆది అన్నారు.

9వ తరగతికి వచ్చేసరికి ప్రైవేట్ స్కూల్ కు మారానని ఆది తెలిపారు. అప్పుడు ఒకమ్మాయి ఆ స్కూల్ కు వచ్చిందని ఆ అమ్మాయిని ప్రేమించానని ఆది చెప్పుకొచ్చారు. నేను నా క్లాస్ అయిపోయి కిందకు దిగగానే ఆ అమ్మాయి వస్తోందని ఆ ఫీలింగ్ కొత్తగా ఉందని ఆది చెప్పుకొచ్చారు.

ఢీ షో ప్రోమోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఫుల్ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ హైపర్ ఆది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. హైపర్ ఆది ప్రేమించిన అమ్మాయిని షోలోకి తీసుకొస్తే బాగుంటుందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ కోరికను హైపర్ ఆది తీరుస్తారో లేదో చూడాల్సి ఉంది. హైపర్ ఆదికి రోజురోజుకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus