బుల్లితెర పై ప్రసారమయ్యే కార్యక్రమాల ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు హైపర్ ఆది. ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో ఫేమస్ హైపర్ ఆది జబర్దస్త్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్నారు.ఇకపోతే తాజాగా వచ్చే వారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రతి ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ఏదో ఒక కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తారు.
ఇకపోతే ఈ వారం కూడా హైపర్ ఆది పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆటపాటలతో ఎంతో సందడిగా ఈ కార్యక్రమం కొనసాగింది. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో భాగంగా రష్మీ హైపర్ ఆదికి శుభాకాంక్షలు తెలుపుతూ ఎదవకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ కామెంట్ చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది ఒక్కసారిగా పాట పాడి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. పుట్టినరోజు సందర్భంగా ఈయన కమెడియన్ నూకరాజుతో కలిసి శ్రీరామదాసు సినిమాలో పాట పాడుతూ అందరిని సందడి చేశారు.
అచ్చం నైపుణ్యం ఉన్నటువంటి సింగర్ గా నూకరాజు హైపర్ ఆది ఎంతో అద్భుతంగా ఈ పాటను ఆలపించారు. వీరిద్దరూ పాట పాడుతున్నంత సేపు అక్కడున్నటువంటి వారు ఎంతో పరవశించిపోయారు. ఇకపోతే కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో వైరల్ గా మారడంతో ఇది చూసిన నేటిజన్లు హైపర్ ఆదిలో కామెడీ యాంగిల్ మాత్రమే కాకుండా సింగింగ్ టాలెంట్ కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా మల్లెమాలవారు మరొక కొత్త డాన్సర్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు.కండక్టర్ ఝాన్సీని పరిచయం చేసిన విధంగానే ఈసారి నెల్లూరు కవిత అనే డాన్సర్ ను పరిచయం చేశారు.