బండ్లన్నకు కోపం వచ్చింది.. మండిపడుతూ ట్వీట్..!

తెలంగాణలో డిసెంబర్ 1న(ఈరోజు) జి.హెచ్.ఎం.సి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అన్ని పార్టీల అభ్యర్థులు ఓ రేంజ్ రేంజ్లో ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడ ఇదే హవా నడిచింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై టీ.ఆర్.ఎస్ నాయకురాలు కవిత విమర్శలు గుప్పించారు. ‘బండ్ల గణేష్ లాగా.. బండి సంజయ్ కూడా ఓ జోకర్’ అంటూ ఆమె కామెంట్ చేశారు. నిజానికి కవిత గారు విమర్శలు చేసింది బీజేపీ నేతపైనే అయినప్పటికీ…

మధ్యలో తన పేరుని వాడటం మన పైగా తనని జోకర్ అనడం.. నటుడు మరియు నిర్మాత బండ్ల గణేష్ కు కోపం తెప్పించింది. దాంతో ఆయన కూడా సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనని వ్యక్తం చేశారు. బండ్ల గణేష్ తన ట్విట్టర్లో కవితగారిని ట్యాగ్ చేస్తూ ‘నేను జోకర్ని కాదు.. ఫైటర్ని’ అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేసిన బండ్ల గణేష్ కు ఎటువంటి సీటు లభించలేదు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు టి.ఆర్.ఎస్ పార్టీ పై ఓ రేంజ్లో విమర్శలు చేస్తూ కామెడీ చేసాడు మన బండ్లన్న. ‘కే.సీ.ఆర్ కచ్చితంగా ఓడిపోతారని, ఆలా జరగకపోతే 7’O’ క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని ఓపెన్ ఛాలెంజ్ చేసాడు. ఆ తర్వాత సీన్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అందుకే ఇలాంటి టైములో టి.ఆర్.ఎస్ పార్టీ వారు బండ్లన్న పేరుని ప్రస్తావించినట్టు స్పష్టమవుతుంది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus