అసలు కలవనేలేదు, ప్రేమ ఎప్పుడు పుట్టింది??
- May 24, 2016 / 01:01 PM ISTByFilmy Focus
గత కొన్ని రోజులుగా రణబీర్ కపూర్ కొత్త గర్ల్ ఫ్రెండ్ గా సోషల్ మీడియాలో చలామణి అవుతున్న భారతి మల్హోత్రా.. “అసలు నేను ఇప్పటివరకూ రణబీర్ కపూర్ ను కలవలేనేలేదు, మరి మా ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు పుట్టింది? మేం ఎక్కడ డేటింగ్ చేస్తున్నాం” అంటూ నిన్నమొన్నటివరకూ వీరిద్దరి ప్రేమ కావ్యాలను వ్రాస్తున్నా గాసిప్పు రాయుళ్లను ప్రశ్నించింది.
కత్రినాతో బ్రేకప్ తర్వాత రణబీర్ ఒక డిల్లీ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు అంటూ పలు బాలీవుడ్ వెబ్ సైట్లు భారతి ఫోటోటో సహా పోస్ట్ చేశారు. ఆ విషయంలో బాగా సీరియస్ అయిన భారతి, సదరు వెబ్ సైట్ల వారిని తన ఫేస్ బుక్ ఎకౌంట్ ద్వారా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














