ఇప్పుడు ఆమె గ్లామర్ రోల్స్ చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా

హీరోయిన్ లకు పెళ్ళైతే ఆఫర్లు రావడమే చాలా కష్టం … ఒకవేళ వచ్చినా ఏదో సైడ్ క్యారెక్టర్ లు.. అక్క, వదిన వంటి పాత్రలే ఎక్కువ వస్తుంటాయి. అయితే కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి గౌడ భార్య అయిన రాధిక మాత్రం మళ్ళీ హీరోయిన్ గా చేయడానికి రెడీ అవుతుందట. నిర్మాత కుమారస్వామి తో పరిచయం ఏర్పడ్డాక ఆయన్ని వివాహం చేసుకుంది రాధిక. అదే టైములో కొన్ని సినిమాలకు కూడా కమిట్ అయ్యిందట.

పెండింగ్ లో ఉన్న ఆ ప్రాజెక్ట్ లను పూర్తి చేయడానికి రెడీ అయ్యింది ఈ బ్యూటీ. అవి గ్లామర్ రోల్స్ అని కూడా తెలుస్తుంది. ఇదే మంచి టైం కదా అని మరిన్ని సినిమాలు చెయ్యడానికి కూడా రెడీ అయ్యిందట. ఇప్పటికి బానే ఉంది. పెళ్ళైన ఈ బ్యూటీ గ్లామర్ రోల్స్ చేస్తాను అంటే ఏ హీరోలు ఓకే అంటారు. ఒక వేళ ఓకే అన్నా ప్రేక్షకులు ఈమెను ఆ పాత్రలకు యాక్సెప్ట్ చేస్తారా..?

I am ready for any role says Radhika1

ఒక వేళ ఇలాంటి పాత్రలే చెయ్యాలి అని కూర్చుంటే… భవిష్యత్తు లో దర్శక నిర్మాతలు ఈమె వైపు చూస్తారా? హీరోయిన్ రేంజ్ లో ఇంకు రెమ్యూనరేషన్ ఇస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఈమె తెలుగులో కూడా సినిమాలు చేసింది. నందమూరి తారకరత్న హీరోగా చేసిన ‘భద్రాద్రి రాముడు’ , అలాగే కోడిరామ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ‘అవతారం’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus