నేను స్వార్ధపరుణ్ణి – అల్లు ఆరవింద్!!!

  • December 19, 2016 / 06:40 AM IST

టాలీవుడ్ బడా నిర్మాతలలో ఒకరు…టాలీవుడ్ ఆ నలుగురులో టాప్1 అయిన అల్లు ఆరవింద్ ఒకానొక మీడియా సమావేశంలో చాలా ఆవేశంగా, చాలా తెలివిగా మాట్లాడారు అని తెలుస్తుంది..ఎప్పుడూ మీడియాతో పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడని అల్లు ఆరవింద్, ఈ ప్రెస్ మీట్ లో ఓపెన్ గా మాట్లాదేశాడు..అంతేకాదు…తాను చాలా స్వార్ధ పరుణ్ణి అంటూ ఏవేవో లెక్కలు చెప్పేసాడు…..విషయంలోకి వెళితే…ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ‘ధృవ’ మూవీ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు ఈ నిర్మాత…తాను ‘ధృవ’ సినిమాను ‘మగధీర’ కంటే ఎక్కువ కలక్షన్స్ వసూలు చేయాలి అన్న స్వార్ధంతో నిర్మించానని ఈసినిమా సూపర్ హిట్ అయినా కలక్షన్స్ గురించి ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే ఈ వారాంతం తరువాత మాట్లాడితే బాగుంటుంది అంటూ ‘ధృవ’ కలక్షన్స్ పై మాట్లాడుతున్న వారికి వార్నింగ్ మెసేజ్ పంపించాడు.

అంతేకాకుండా ధృవ భాద్యత అంతా తనదే అని…‘ధృవ’ కలక్షన్స్ పై నోట్ల రద్దు ప్రభావం ఉంది అన్న విషయం తనకు అర్ధం అయిందని ఈ ప్రభావం వల్ల తన సినిమా నష్టపోతే ఆ రిస్క్ తాను పడతాను అని చెర్రీ చెప్పినప్పటికీ కష్టమైనా…నష్టం అయినా నాది భాద్యత అంటూ ముందుకు దూకాను అని తెలిపాడు ఆరవింద్. ఇక సినిమాలో చెర్రీ పాత్ర కన్నా ఆరవింద్ స్వామి పాత్రకు మంచి పేరు వచ్చింది అన్న కామెంట్స్ కు కూడా కౌంటర్ ఇస్తూ…ఈసినిమా మేకోవర్ లో చరణ్ ‘తని ఒరువన్’ ఒరిజనల్ మూవీకి ఎటువంటి మార్పులు చేయవద్దని చరణ్ ఎంత తపన పడ్డాడో తనకు తెలుసు అని  చెబుతూనే…ఈసినిమా బాగా రావాలి అన్న తపనతో అరవింద్ స్వామి పాత్రకు ఎటువంటి కోత విధించవద్దని పదేపదే చెర్రీ తనకు చెప్పాడు అని తెలిపాడు ఆరవింద్…అసలు ఆరవింద్ ఎప్పుడూ లేనిది ఇలా మాట్లాడటం ఏంటి అని టాలీవుడ్ సర్కిల్స్ లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి..

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus