రష్మికను కంటతడి పెట్టించిన ఆ డైరెక్టర్…ఎవరంటే ?

ప్రస్తుతం టాలీవుడ్లో ‘గోల్డెన్ లెగ్’ గా మారిపోయింది రష్మిక మందన. ‘ఛలో’ వంటి తొలిచిత్రం తోనే బ్లాక్ బస్టర్ అందుకుని… ‘గీత గోవిందం’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ను తన అకౌంట్ లో వేసుకుంది. ‘దేవదాస్’ చిత్రం పర్వాలేదనిపించినా బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. ప్రస్తుతం మరోసారి విజయ్ దేవకొండ సరసన ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తుంది ఈ భామ. ఇదిలా ఉండగా ‘గీత గోవిందం’ షూటింగ్ సమయంలో ఈ భామ కంటతడి పెట్టుకుందట. అంతలా కంటతడి పెట్టుకునేంతలా ఏం జరిగిందని ఆమెను ప్రశ్నించగా… ఆమె ఇలా చెప్పుకొచ్చింది.

‘గీత గోవిందం’ షూటింగ్ సమయంలో …. ఒకరోజు షూటింగ్ లొకేషన్ కు ఆలస్యంగా వెళ్ళిందట. అప్పుడు ఆ చిత్ర యూనిట్ మెంబర్స్ లో ఎవరూ తనతో సరిగా మాట్లాడలేదట. అలా అందరూ తనను ఎడబాయడంతో అర్థంకాక.. ఇబ్బందిగా అనిపించి కంట తడి పెట్టుకుందట. అయితే కాసేపటికి దర్శకుడు పరశురామ్ తనదగ్గరకు వచ్చి అసలు సంగతి చెప్పాడట. రష్మిక సహజంగా బాధపడుతున్నప్పుడు ఉండే హావభావాలను కెమెరాలో బంధించడం కోసం వారంతా కలిసి ఇలా చేశారట. అయితే ‘గీత గోవిందం’ లో అది ఏ సన్నివేశం అన్నది చెప్పలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus