సినిమా రంగంలో ఛాన్స్ అందుకోవడమే కాదు.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం పర్చుకోవడం, వచ్చిన పేరుని నిలుపుకోవడం అత్యంత కష్టం. అందుకోసం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ముఖ్యంగా స్టోరీ సెలక్షన్ లో శ్రద్ధ పెట్టాలి. బాగా లేని కథలో ఎంత బాగా నటించినా ఫలితం ఉండదు. ఒక అపజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడం తప్ప. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం కథ కూడా వినకుండానే ఆ సినిమా చేస్తానని చెప్పిందంట. నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ వంటి విజయాలను అందుకొని టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా నిలదొక్కుకున్న సమయంలో ఇలాంటి నిర్ణయం సాహసంతో కూడిన విషయం. అయితే ఆ సాహసం తాను ఇష్టంతో చేసిందని వివరించింది.
ఆమె స్టోరీ వినకుండా ఒకే చెప్పిన మూవీ ఏంటంటే స్పైడర్. రకుల్‌కు ఎప్పటి నుంచో మహేష్ బాబు సినిమాలో చేయాలనే కోరిక ఉంది. ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో చేసే ఛాన్స్ వచ్చినట్టు వచ్చి చేజారిపోయింది. దర్శకుడు మురుగదాస్ అంటే కూడా ఆమెకు చాలా అభిమానం. అలాంటింది ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో మురుగదాస్ అడిగిన వెంటనే ‘నేను ఆ సినిమా చేస్తున్నాను’ అని అనేసిందట. ప్రస్తుతం ఈ సినిమాలో చివరి పాటను షూటింగ్ చేస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లోకి రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.