‘డ్రీం’గర్ల్ చెప్పిన తెలుగు ముచ్చట్లు!!!

డ్రీం గర్ల్….డ్రీం గర్ల్..అంటూ ఆనాడు ఒక బాలీవుడ్ సినిమాలో వచ్చిన పాట గుర్తుందా….అదే మన హేమామాలినీ ధర్మెందర్ ఇద్దరూ కలసి నటించిన ఒక సినిమాలో పాట ఇది. అయితే అలనాడు డ్రీం గర్ల్ గా పేరు ప్రఖ్యాతలు గడించిన అలనాటి అందాల భామ హేమామాలినీ మన సౌత్ ఇండియన్ అంటే నమ్మగలరా…అవును మన డ్రీం గర్ల్ ది తమిళనాడు. ఆమె మాతృ బాష తమిళ బాష. అయితే దాదాపుగా 45ఏళ్ల తరువాత మళ్లీ సౌత్ ఇండియన్ సినిమాలో అదీ తెలుగులో నటిస్తున్న హేమామాలినీ ఇప్పుడు షాపింగ్ లో బిజీగా ఉన్నారు…తనకు నచ్చిన చీరలను తాను సొంతంగా కొని మరీ తన బంధువులకు తీసుకువెళ్ళాలి అని ప్లాన్ చేశారట.

ఇదిలా ఉంటే తన కరియర్ గురించి తెలుగు పరిశ్రమతో తనకున్న అనుభవం గురించి ఆమె మాట్లాడుతూ…అదే క్రమంలో శాతకర్ణి సినిమా ఆఫర్ గురించి వివరిస్తూ….45 ఏళ్ల తర్వాత తెలుగులో నటించేందుకు మొదట చాలా సందేహించిందట…దానికి గల కారణం ఏంటి అంటే…తనకు తెలుగ్ రాకపోవడమే. అయితే దర్శకుడు తనకు పాత్ర చెప్పిన విధానం, అంతేకాకుండా ఆ పాత్రలో ఉన్న డెప్త్ అర్ధం చేసుకున్నాక ఈ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది అని అనిపించింది. అందులోనూ ఈ పాత్ర బాలకృష్ణ తల్లిగా మహారాణి రోల్ కావడంతో చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఇక మరో పక్క తెలుగు భాష నా మాతృభాష అయిన తమిళ్ కి దగ్గరగా ఉండడంతో డైలాగ్స్ అన్నీ తమిళ్ లోను.. కొన్నిసార్లు ఇంగ్లీష్ లో రాసుకుని మరీ చెప్పేస్తున్నా అంటుంది. ఇక తన కరియర్ ఆరంభం గురించి మాట్లాడుతూ…17 ఏళ్ల వయసులో తన కెరీర్ ను తెలుగు సినిమాలో డ్యాన్స్ మెంబర్ గానే ప్రారంభమైందన్న ఈమె.. ఆ తర్వాత ఏడేళ్లకు మరో తెలుగు సినిమాలో చేశానని తన తెలుగు అనుభవాలను వివరించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus