తమిళ అభిమానులకు మాట ఇచ్చిన ప్రభాస్
- April 10, 2017 / 11:58 AM ISTByFilmy Focus
వర్షం సినిమా నుంచి ప్రభాస్ కి పొరుగు రాష్ట్రాల్లో అభిమానులు పెరగడం మొదలయ్యారు. డార్లింగ్ నటించిన అనేక చిత్రాలు తమిళంలో అనువాదమై రిలీజ్ అయ్యాయి. ఇక బాహుబలి సినిమాతో తమిళ హీరో రేంజ్ లో అక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. అక్కడి అభిమానులందరూ బాహుబలి కంక్లూజన్ కోసం ఎదురుచూస్తున్నారు. వారి కోసం బాహుబలి 2 తమిళ వెర్షన్ ఆడియో వేడుకను చెన్నైలో నిన్న వైభవంగా నిర్వహించారు. తమిళీవులు ప్రభాస్ ని చూసేందుకు పోటెత్తారు.
ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ “నేను పుట్టింది చెన్నైలోనే. అందుకే తమిళ ఫ్యాన్స్ కోసం తప్పకుండా డైరక్ట్ తమిళ సినిమా చేస్తాను” అని అక్కడ అభిమానులకు మాట ఇచ్చారు. ప్రభాస్ బాహుబలి 2 తర్వాత సుజీత్ డైరక్షన్లో చేస్తున్న చిత్రం ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది. దీనిఫై కూడా భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















