అరుంధతి సినిమాలో అనుష్కను చూసి పశుపతి క్యారక్టర్ “బొమ్మాలి నిన్ను వదలా” అని వెంటపడతాడు. ప్రస్తుతం అదే డైలాగ్ అనుష్క నోటా వినిపిస్తోంది. ప్రభాస్ అంటే తనకిష్టమని, అతన్ని వదిలే ప్రసక్తే లేదని నిర్మొహమాటంగా చెబుతోంది. ఇదివరకు అనుష్క, ప్రభాస్ బిల్లా మూవీలో కలిసి నటించింది. ఆ తర్వాత ఈ జంట మిర్చి మూవీలో అలరించింది. ఇక బాహుబలి సినిమాతో అయితే ఈ జంట ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. దీంతో అనుష్క కనిపించగానే ఇంట్రనేషనల్ మీడియా కూడా ప్రభాస్ గురించి ప్రస్తావన తీసుకొస్తున్నారు. రెండు రోజుల క్రితం విదేశీ ఛానల్ వారికీ స్వీటీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో యాంకర్ ప్రభాస్తో మళ్ళీ నటిస్తారా?
అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ” ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. అతడితో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నా. అసలు ప్రభాస్ తో నటించే అవకాశం వచ్చినప్పుడల్లా నటిస్తూనే ఉంటా” అంటూ వెల్లడించింది. ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’, ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో కథానాయకులు ఖరారు కాలేదు. వీటిలో హీరోయిన్ గా అనుష్క కనిపించవచ్చని ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.