నాకు పేరు రాకపోయినా.. నాకు అందించిన కంఫర్ట్స్ కోసం అలా చేయాల్సి వచ్చింది

ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ & రైటర్ గా ఇండస్ట్రీలో స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్న చాలామంది.. ఒకప్పుడు గోస్ట్ రైటర్ & డైరెక్టర్ గా వర్క్ చేసినవాళ్ళే. అదృష్టం బాగుంటే తదనంతరం వాళ్ళు కూడా వెండితెరకు పరిచయమవుతారు లేదంటే.. బిహైండ్ ది స్క్రీన్ కి పరిమితమైపోతారు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్న కొరటాల శివ, హరీష్ శంకర్ లు కూడా ఒకప్పుడు గోస్ట్ రైటర్స్ గా వర్క్ చేసినవాళ్ళే. ఇదే విషయాన్ని ఇటీవల ప్రస్తావిస్తూ.. “అప్పట్లో మాకు ఒక ఏసీ రూమ్ ఇచ్చి.. మూడు పూట్లా మంచి ఫుడ్, బిర్యానీ పెట్టేవారు. కొన్ని ప్రాజెక్ట్స్ కి మంచి డబ్బులు వచ్చేవి, కొన్నిటికి వచ్చేవి కావు. అయినా అలా టైం పాస్ చేసేవాళ్ళం. మాకు పేరు వస్తుందా రావడం లేదా అనేది పట్టించుకొనేవాళ్ళం కాదు. కానీ.. ఇప్పుడు జనరేషన్ రైటర్స్ అలా గోస్టులుగా ఉండడానికి ఇష్టపడడం లేదు. నేను కూడా నా డైరెక్షన్ & రైటర్స్ టీమ్ అందరికీ సమానమైన క్రెడిట్ ఇస్తున్నాను అంటూ తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు హరీష్ శంకర్.

ఇకపోతే.. హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన “వాల్మీకి” ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుండగా.. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ట్రైలర్, సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా గబ్బర్ సింగ్ రేంజ్ హిట్ అవుతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. మరి రిజల్ట్ ఏమవుతుంది అనేది తెలియాలంటే సెప్టెంబర్ 20 వరకు వెయిట్ చేయాల్సిందే.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus