Allu Arjun: ఆ ట్వీట్ కు అర్థమేంటి బన్నీ.. చిరంజీవి పేరు లేకుండానే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉందనే సంగతి తెలిసిందే. అయితే కెరీర్ తొలినాళ్లలో మెగా ఫ్యాన్స్ సపోర్ట్ వల్లే బన్నీ ఈ స్థాయికి ఎదిగారు. ఐకాన్ స్టార్ ట్యాగ్ తో బన్నీ ప్రస్తుతం సులువుగా 200 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను అందుకుంటున్నారు. ఇతర భాషల్లో కూడా బన్నీకి మంచి పాపులారిటీ ఉండగా హిందీ ఆడియన్స్ సైతం బన్నీ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే రామ్ చరణ్ పుట్టినరోజున బన్నీ విష్ చేయకపోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. బన్నీ పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పి ఉండవచ్చని అంత మాత్రాన సోషల్ మీడియాలో ట్వీట్ చేయకపోవడం కరెక్ట్ కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ వచ్చిన సమయంలో కూడా బన్నీ ఆలస్యంగా ట్వీట్ చేయడంపై ఒకింత విమర్శలు వచ్చాయి. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉన్న బన్నీ తాజాగా చిరంజీవి పేరు ప్రస్తావించకుండా ఒక ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

ఇండస్ట్రీలోకి నేను అడుగు పెట్టి 20 సంవత్సరాలు అవుతోందని ప్రేక్షకుల ప్రేమ, అభిమానం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని బన్నీ పేర్కొన్నారు. కెరీర్ తొలినాళ్లలో బన్నీ కథల ఎంపికలో చిరంజీవి సహాయసహకారాలు ఎంతో ఉన్నాయి. తన ఎదుగుదల విషయంలో చిరంజీవి పాత్ర ఉందనే విషయాన్ని బన్నీ మరిచిపోయారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ కామెంట్ల విషయంలో బన్నీ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం పుష్ప2 సినిమాతో బిజీగా ఉండగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పుష్ప2 బడ్జెట్ 400 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమాకు 1000 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పుష్ప2 సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus