మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా ‘మాస్ జాతర’ (Mass Jathara) అనే రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘మనదే ఇదంతా’ అనేది దీనికి క్యాప్షన్. ‘ఇడియట్’ (Idiot) సినిమాలో డైలాగ్ అది. దానిపై చాలా మీమ్స్ కూడా వచ్చాయి. ‘ఇడియట్’ అనేది రవితేజ కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్. ఆ సినిమా రిఫరెన్సులు ‘మాస్ జాతర’ లో చాలా వాడుతున్నట్టు కనిపిస్తుంది. ఇలా ఎందుకు అంటున్నానంటే.. ఆ డైలాగ్ మాత్రమే కాదు అందులోని ఓ పాటను కూడా ‘మాస్ జాతర’ కోసం వాడుతున్నారట.
వివరాల్లోకి వెళితే… పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ‘ఇడియట్’ సినిమాకి చక్రి (Chakri) సంగీత దర్శకుడు. ఆ సినిమాలో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే’ అనే పాట అప్పట్లో ఓ ఊపు ఊపింది. ఇందులో రవితేజ చేసిన స్టెప్పులు కూడా బాగా ఫేమస్. ఇప్పుడు ‘మాస్ జాతర’ సినిమా కోసం ఈ పాటని రీమిక్స్ చేస్తున్నారట. భీమ్స్ (Bheems Ceciroleo) ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. రీమిక్స్ సాంగ్స్ చేయడంలో భీమ్స్ దిట్ట.
సో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే’ రీమిక్స్ కూడా చార్ట్ బస్టర్ అయ్యి ఇప్పటి యూత్ తో కూడా చిందులు వేయిస్తుందేమో చూడాలి. ఇక ‘మాస్ జాతర ‘ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల (Sreeleela) నటిస్తుంది. భాను భోగవరపు (Bhanu Bhogavarapu) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. జూలై 18న ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.