పవర్ స్టార్ సర్దార్ గబ్బర్ సింగ్ పై మెల్ల మెల్లగా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. సర్దార్ షూటింగ్ సమయం నుంచి సినిమా ఆడియో వేడుక జరిగే అంతవరకూ కూడా సర్దార్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఎప్పుడైతే ఆడియో వేడుక జరిగి, పాటలు బయటకు వచ్చాయో, ఫాన్స్ కు సీన్ అర్ధం అయిపోయింది. మరో పక్క ఈ సినిమాకు విడుదలకు ముందే దాదాపుగా 100కోట్లు ప్రీ- బిజినెస్ జరిగింది. అయితే ఇప్పుడు ఆ ప్రీ-బిజినెస్సే కాస్త తలనొప్పిగా మారింది. విషయం ఏమిటంటే, ఎన్నో భారీ అంచనాలతో విడుదల అవుతున్న ఈ చిత్రం ఫలితంలో ఏమైనా తేడా జరిగితే ఈసినిమాకు జరిగిన భారీ బిజినెస్ రీత్యా బయ్యర్లు దాదాపు 25 కోట్ల నుండి 50 కోట్ల వరకు నష్టపోయే ఆస్కారం ఉంది. మరో పక్క ఈ సినిమాకు నెగేటివ్ టాక్ ఒకటి పవన్ ను చాలా కలవరపెడుతుంది…ఇక వీటన్నింటినీ సరిదిద్దేందుకు రంగంలోకి దిగిన పవన్ అలాంటి పరిస్థితులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నాడు. ఇక మరో పక్క సినిమా నిర్మాత శరత్ మరార్ పై కూడా ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. ఈసినిమా ఓవర్సీస్ హక్కులను 10 కోట్లకు కొనుక్కున్న అక్కడి బయ్యర్లు ఈసినిమా రిలీజ్ టాక్ రాకుండానే ఏప్రియల్ 7వ తారీకు రాత్రి తారీఖున భారీ స్థాయిలో అమెరికాలో ప్రీమియర్ షోలను వేయకపోతే తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటామని ఈ సినిమాను కొనుక్కున్న ఓవర్సీస్ బయ్యర్లు అదేవిధంగా ఈరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా వాదిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ వ్యవహారం అంతా చూస్తే ఇన్ని అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం రిసల్ట్ ఏమాత్రం తేడా వచ్చినా…అంతా “అస్సామే” అంటున్నారు పవన్ అభిమానులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.