IIFA Awards 2023: ఐఫాలో అందాల మంటలు రేపారుగా.. డ్యాన్సేసిన భామలు వీరే!

  • May 29, 2023 / 01:24 AM IST

అందాలు, అవార్డులు.. రెండింటికీ కేరాఫ్‌ అడ్రెస్‌ నిలిచే పురస్కారాల్లో ఐఫా ఒకటి. బాలీవుడ్‌ సినిమాను గౌరవించుకుంటూ పురస్కారాలు అందించే ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడెమీ అవార్డ్స్‌ (ఐఫా) ఇటీవల దుబాయిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ సెలబ్రిటీలు చాలామంది హాజరయ్యారు. వేదిక మీద డ్యాన్స్‌లు వేసి అలరించారు కూడా. అలా అందాల మంటలు రేపిన వారిలో నోరా ఫతేహి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, కృతి సనన్‌ తదితరులు ఉన్నారు.

ఈ అవార్డుల్లో (IIFA Awards) ఉత్తమ నటుడిగా హృతిక్‌ రోషన్ ‌(‘విక్రమ్‌ వేద’) నిలవగా, ‘గంగూబాయి కాఠియావాడి’ సినిమాలో నటనకు గానూ అలియా భట్‌ ఉత్తమ నటిగా నిలిచింది. ‘దృశ్యం2’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. మిగిలిన అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తమ నటుడు: హృతిక్‌ రోషన్‌ (‘విక్రమ్‌ వేద’), నటి: అలియా భట్‌ (‘గంగూబాయి కాఠియావాడి’), చిత్రం: ‘దృశ్యం 2’, దర్శకుడు: ఆర్‌.మాధవన్‌ (‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’), సహాయ నటుడు: అనిల్‌ కపూర్‌ (‘జుగ్‌ జుగ్‌ జియో’), సహాయ నటి: మౌనీ రాయ్‌ (‘బ్రహ్మాస్త్ర’) నిలిచారు.

ఉత్తమ సంగీత దర్శకుడు: ప్రీతమ్‌ (‘బ్రహ్మాస్త్ర’), గీత రచయిత: అమిత్‌ భట్టాచార్య (కేసరియా… ‘బ్రహ్మాస్త్ర’), తొలి చిత్ర నటుడు: శంతను మహేశ్వరి (గంగూబాయి కాఠియావాడి), బబ్లీ ఖాన్‌ (ఖులా) , తొలి చిత్ర నటి: కుషాలీ కుమార్‌ (దోఖా: రౌండ్‌ డి కార్నర్‌) పురస్కారాలు అందుకున్నారు. అవుట్‌స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ ఫ్యాషన్‌ ఇన్‌ సినిమా అవార్డును మనీష్‌ మల్హోత్ర అందుకున్నారు.

ఇక భారతీయ చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించినందుకు కమల్‌ హాసన్‌కు అవుట్‌ స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ ఇండియన్‌ సినిమా పురస్కారాన్ని అందజేశారు. అవుట్‌ స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ రీజినల్‌ సినిమా పురస్కారాన్ని రితేష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా దంపతులకు ఇచ్చారు. అయితే అలియా భట్‌ ఈ అవార్డుల వేడుకకు రాలేదు. దీంతో ఉత్తమ నటి అవార్డును ఆమె తరపున నిర్మాత జయంతి లాల్‌ అందుకున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus