‘నీలి నీలి ఆకాశం’ అనే చార్ట్ బస్టర్ సాంగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే చిత్రంలోని ఈ పాట ఆ చిత్రం సక్సెస్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అలాంటి మరో చార్ట్ బస్టర్ సాంగ్ తో వచ్చేశారు సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్, సిద్ శ్రీరామ్. వివరాల్లోకి వెళితే.. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రం దర్శకుడు మున్నా ధూళిపూడి ‘బ్యాడ్ గాళ్స్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘కానీ చాలా మంచోళ్ళు’ అనేది దీని క్యాప్షన్. ‘నీలి నీలి క్రియేషన్స్’ ‘ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్’ ‘ఎన్‌వీఎల్ క్రియేషన్స్’ సంస్థలపై శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.