దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు శిష్యుడు వై.వి.ఎస్. చౌదరి ‘దేవదాసు’ సినిమాతో రామ్ పోతినేనిని హీరోగా, సన్నజాజి నడుముతో కుర్రకారు మతులు పోగొట్టిన గోవా బ్యూటీ ఇలియానాని హీరోయిన్‌గా పరిచయం చేసాడు. రెండో సినిమా ‘పోకిరి’ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దాదాపు యంగ్ స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడింది. తక్కువ టైంలోనే మంచి గుర్తింపు, ఫ్యాన్ బేస్ సంపాదించుకోవడమే కాక.. అక్షరాలా కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుని ఇండస్ట్రీ వర్గాల వారిని, మిగతా హీరోయిన్లను ఆశ్చర్యపరిచింది.
తర్వాత కన్నడలోనూ నటించింది. ఎప్పుడైతే హిందీలో ఆఫర్లు వచ్చాయో అప్పుడు తనను స్టార్‌ని చేసిన టాలీవుడ్‌ని పట్టించుకోవడం మానేసింది. సౌత్‌ని చిన్నచూపు చూసిన నువ్వు మాకు అక్కర్లేదు అంటూ మన మేకర్స్ కూడా పక్కన పెట్టేశారు. హిందీలో ఆఫర్లు అయితే వచ్చాయి కానీ పాపం హిట్ దక్కలేదు. మధ్యలో బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం కారణంగానూ కెరీర్ డ్యామేజ్ అయింది. చాాన్నాళ్లకి తెలుగులో మాస్ మహారాజా రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ తో రీఎంట్రీ ఇచ్చినా లాభం లేకపోయింది.
దీంతో ఇక్కడ, అక్కడ.. ఎక్కడా అవకాశాల్లేక దాదాపుగా ఫేడవుట్ అయిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ.. తన పర్సనల్ విషయాలు, అప్పుడప్పుడు నేనొకదాన్ని ఉన్నానని గుర్తించండి అన్నట్టు కాస్త గ్లామర్ ఒలకబోస్తూ ఫోటోషూట్ పిక్స్ అవీ షేర్ చేస్తుంటుంది. రీసెంట్‌గా అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైనట్లు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది ఇల్లీ బేబీ.. తిండి కూడా తినలేని పరిస్థితి ఏర్పడడంతో డాక్టర్స్ సెలైన్స్ ఎక్కించారని చెప్పుకొచ్చింది..
‘ఒక్క రోజులో ఎంత మార్పు.. మంచి డాక్టర్లు.. 3 బ్యాగుల ఐవీ లిక్విడ్స్’ అని ఒక స్టోరీలో.. ‘అందరూ నా ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నా కృతజ్ఞతలు. ఇప్పుడు బాగానే ఉన్నాను. నాకు మంచి వైద్యం అందుతోంది’ అంటూ మరో స్టోరీలో రాసుకొచ్చింది. దీంతో ఇలియానా త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇలియానా స్టోరీలకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్ వైరల్‌గా మారాయి.
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?