Ileana: రోజంతా ఇలాగే ఉండాల్సి వస్తోంది!

సినీనటి ఇలియానా ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగినటువంటి ఈమె అనంతరం అవకాశాలను కోల్పోతూ పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పటికి తన పెళ్లి జరిగిందా లేదా అన్న విషయాన్ని తెలియజేయకపోయినా తాను మాత్రం తల్లి అయిన విషయం అందరికీ తెలిసిందే.

ఇలా ఇన్ని రోజులు పాటు సోషల్ మీడియా వేదికగా తన ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే ఈమె తాజాగా తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోలన్నింటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఇలియానా ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా తన కొడుకు గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇలియానా (Ileana) తన కుమారుడికి ఆరోగ్యం చేసింది కాబోలు ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఎంతో ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన కొడుకుతో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ ఈ బాధని ఎదుర్కోవడం గురించి మనకి ఎవరు నేర్పించారు. ఇది ఎంతో కష్టంగా ఉంటుందనీ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే మరొక ఫోటోని షేర్ చేస్తూ రోజంతా ఇలాగే బాబుని ఎత్తుకొని ఉండాల్సి వస్తోంది.నాకు కూడా ఈ చిట్టి కౌగిలింతలు అవసరం అంటూ మరొక పోస్ట్ చేశారు.

ఇలా తన కుమారుడితో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ ఈమె చేసినటువంటి ఈ పోస్టు వైరల్ అవుతున్నాయి. ఇక ఇలియానాకు పెళ్లి జరిగిందా లేదా అన్న విషయం గురించి ఇప్పటికీ అందరిలోనూ పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈమె తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసినప్పటికీ ఆయన విషయాల గురించి మాత్రం ఎక్కడా తెలియచేయలేదు. అలాగే తనకు పెళ్లి జరిగిందా లేదా అన్న విషయాలను కూడా ఈమె ఎక్కడ బయట పెట్టకపోవడం గమనార్హం.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus