Ileana: మరోసారి బేబి బంప్ రివిల్ చేసిన ఇలియానా..వైరల్ అవుతున్న బేబీ బంప్ పోస్ట్.!

గోవా బ్యూటీ ఇలియానా పెళ్లి కాకుండానే తన ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. అప్పటిలో ఈ భామ బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ బ్రదర్ తో డేటింగ్ లో ఉందంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత మళ్ళీ ఆ న్యూస్ పెద్దగా వినిపించకపోవడంతో అవి రూమర్స్ అని తెలియాయి. ఇక ఇటీవల సడన్ గా ఇలియానా తాను తల్లిని కాబోతున్నాను అంటూ ప్రకటించడంతో అసలు ఈ భామ ఎవర్ని పెళ్లి చేసుకుంది.

ఈ పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు అంటూ నెటిజెన్లు ప్రశ్నలు వేయడం మొదలు పెట్టారు. ఈ ప్రకటన తరువాత ఒక అబ్బాయితో క్లోజ్ గా ఉన్న ఫోటోని షేర్ చేసినా.. పిక్ బ్లర్ చేసి పేస్ చూపించకుండా పోస్ట్ పెట్టింది. ఇక ఇటీవల డేట్ నైట్ అంటూ ఒక అబ్బాయితో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. మధ్యలో చూపించి చూపించనట్టుగా హింట్‌ ఇచ్చింది. ఇటీవల ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చింది. ఇటీవల తన ప్రియుడితో డిన్నర్ డేట్ కి వెళ్లిన ఇలియానా అక్కడ అతడితో ఉన్న ఫోటోలు షేర్ చేసింది.

దీనితో ఇలియానా మిస్టరీ మాన్ వెలుగులోకి వచ్చాడు. కంప్లీట్ గడ్డంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. మరి అతని వివరాలు మాత్రం వెల్లడించలేదు ఇలియానా. ఇంకా ఆ మిస్టరీని కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్ తన బాయ్ ఫ్రెండ్ అతనే అనుకుంటా, తన ప్రెగ్నెన్సీకి కారణం అతనే అయ్యి ఉంటాడని కామెంట్స్ చేస్తూ వచ్చారు. కానీ ఇలియానా మాత్రం ఇంకా తన రిలేషన్‌షిప్ పై సస్పెన్స్ మెయిన్‌టైన్ చేస్తూనే వస్తుంది.

ఇది ఇలా ఉంటే, ఇలియానా తాజాగా బేబీ బంప్ తో ఉన్న కొత్త ఫోటోని షేర్ చేసింది. ఆ ఫొటోలో ఇలియానా నిండు గర్భిణిగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమెకు 9వ నెల అని సమాచారం. మరో కొన్ని రోజులు ఇలియానా తన చిట్టి బేబీని అందరికి పరిచయం చేయనుంది. ఆ బేబీతో పాటే తన రిలేషన్‌షిప్ పార్ట్నర్ ని కూడా అఫీషియల్ గా పరిచయం చేస్తుందేమో చూడాలి.

మరి ఇలియానా లుక్‌, గెటప్‌, ఆమె పోస్ట్ పై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఇలియానా చాలా బ్యూటీఫుల్‌గా ఉందని అంటున్నారు. మరోవైపు ఇలియానాకి పుట్టబోయేది అమ్మాయా? అనే ఊహాగానాలకు పని చెబుతున్నారు. మొత్తానికి ఇలియానా పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారి ఆమె అభిమానులను ఆనంద పరుస్తుంది..

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus