Ileana: తొమ్మిదో నెలలోకి అడుగుపెట్టిన ఇలియానా… వైరల్ అవుతున్న పోస్ట్!

గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా కొనసాగినటువంటి ఇలియానా ప్రస్తుతం అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె తాను తల్లి కాబోతున్నానంటూ షాకింగ్ న్యూస్ బయట పెట్టారు. ఇలా ఈమె తల్లి కాబోతున్నారనే విషయం తెలియడంతో అందరూ షాక్ అయ్యారు. ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి కావడం ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా ఇలియానా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.

అయితే ఈమె (Ileana)  మాత్రం ఆ అజ్ఞాత వ్యక్తిని రహస్యంగా ఉంచుతూ తన గురించి క్లూ ఇస్తూ వస్తున్నారు.ఇలా ఆ వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలియచేయకుండా తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు. ఇలా ఎప్పటికప్పుడు ప్రెగ్నెన్సీ సమయంలో తనకు కలిగే ఫీలింగ్స్ గురించి అలాగే తన బేబీ బంప్ ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. తాజాగా ఇలియానా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇందులో ఈమె తాను 9వ నెలలోకి అడుగుపెట్టానని చెప్పుకొచ్చారు.

9వ నెల ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ తనకు చాలా ఇబ్బందిగా మారిందని చాలా నీరసంగా ఉంటుంది అంటూ తొమ్మిదవ నెలలో తాను ఎదురుకుంటున్నటువంటి ఇబ్బందుల గురించి తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలియానా సోషల్ మీడియా వేదికగా ఈ పోస్ట్ చేయడంతో ఇలియానా అప్పుడే 9వ నెలలోకే అడుగు పెట్టారా…త్వరలోనే ఈమె బిడ్డకు జన్మనివ్వబోతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus