Tollywood: ఆ జాబితాలో టాలీవుడ్ స్టార్స్ ర్యాంకులు ఇవే.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల బడ్జెట్లు గత ఐదేళ్లతో పోల్చి చూస్తే ఏకంగా మూడు రెట్లు పెరిగాయి. తాజాగా ఐఎండీబీ గత ఏడాది కాలంలో నెటిజన్లు ఎక్కువగా వెతికిన సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో సమంతకు (Samantha) 13వ స్థానం దక్కగా తమన్నాకు (Tamannaah)  16వ స్థానం, నయన్ కు (Nayanthara) 18వ స్థానం దక్కింది.

స్టార్ హీరోల విషయానికి వస్తే ప్రభాస్ కు (Prabhas)  29వ స్థానం దక్కగా చరణ్ కు (Ram Charan) 31వ ర్యాంక్ దక్కింది. అల్లు అర్జున్ (Allu Arjun) ఈ జాబితాలో 47వ స్థానంలో నిలవగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  67వ స్థానంలో నిలిచారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు  (Mahesh Babu) ఈ జాబితాలో 72వ ర్యాంక్ దక్కింది. తమిళ స్టార్ హీరోల విషయానికి వస్తే విజయ్ కు (Vijay Thalapathy)  35వ ర్యాంక్ దక్కగా రజనీకాంత్ (Rajinikanth) 42 స్థానంలో నిలిస్తే విజయ్ సేతుపతి (Vijay Sethupathi) 43వ స్థానంలో నిలవడం గమనార్హం.

కమల్ హాసన్ (Kamal Haasan) 54వ స్థానంలో సూర్య (Suriya) 62వ స్థానంలో నిలిచారు. టాలీవుడ్ స్టార్ హీరోలలో కొంతమంది హీరోలకు మాత్రం టాప్ 100లో ర్యాంకులు దక్కలేదు. ప్రభాస్, చరణ్, బన్నీ, తారక్, మహేష్ బాబుకు మంచి ర్యాంకులు దక్కడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. పాన్ ఇండియా సినిమాల్లో నటించి ఉంటే మహేష్ కు మరింత బెటర్ ర్యాంక్ దక్కేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మహేష్ బాబు గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ ఇప్పటికే విడుదల కాగా కల్కి (Kalki 2898 AD) , పుష్ప2 (Pushpa 2) , దేవర (Devara)  సినిమాలు ఈ ఏడాదే విడుదల కానున్నాయి. గేమ్ ఛేంజర్ (Game Changer)  మూవీ విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ సినిమాల బడ్జెట్ 1500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కాగా ఈ సినిమాల కలెక్షన్లు సైతం అదే రేంజ్ లో ఉంటాయో లేదో చూడాల్సి ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus