Game Changer: గేమ్ ఛేంజర్.. పుష్ప రాజ్ దెబ్బ ఏ రేంజ్ లో ఉందంటే..!

పుష్ప 2 సంధ్య థియేటర్ ఘటన అనంతరం నైజాంలో సర్కార్ తీసుకున్న నిర్ణయాలు గేమ్ ఛేంజర్ టీమ్ పై ప్రభావం చూపిస్తున్నాయి. పుష్ప 2 విడుదలకు ముందు బెనిఫిట్ షోల కోసం భారీ టికెట్ రేట్లు ఆమోదించిన ప్రభుత్వం, గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకుంది. గేమ్ ఛేంజర్ సినిమాకు మిడ్ నైట్ బెనిఫిట్ షోలు నిర్వహించడానికి దిల్ రాజు చేసిన ప్రయత్నం ఫలించలేదు.

తెలంగాణ ప్రభుత్వం, రాత్రి షోలపై అనుమతి నిరాకరిస్తూ స్పష్టమైన జీవో జారీ చేసింది. దీంతో సినిమా అభిమానులు రాత్రి షోల మజాను కోల్పోయారు. పుష్ప 2కి ఇచ్చిన రేట్ల పెంపుతో పోల్చితే, గేమ్ ఛేంజర్‌కు తక్కువ మోస్తరు పెంపునే ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వం తొలిరోజు మల్టీప్లెక్సుల్లో టికెట్ రేట్లను రూ.150 మాత్రమే పెంచగా, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100 పెంపు ఇచ్చింది.

కానీ ఈ పెంపు కూడా కేవలం తొమ్మిదో, పదో తేదీలకు మాత్రమే పరిమితమైంది. 11వ తేదీ నుంచి టికెట్ ధరలను మళ్లీ తగ్గిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా, పుష్ప 2 సినిమాకు 20 రోజుల పాటు టికెట్ రేట్ల పెంపు అనుమతి ఇవ్వగా, గేమ్ ఛేంజర్‌కు కేవలం 10 రోజులు మాత్రమే అవకాశం ఇచ్చింది. ఇది బాక్సాఫీస్ రన్ మీద గేమ్ ఛేంజర్ కలెక్షన్లను ప్రభావితం చేయవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులపై కఠినమైన వైఖరి తీసుకుంది. పుష్ప 2 విజయోత్సాహం నడుమ జరిగిన తొక్కిసలాట ఘటన, ప్రభుత్వానికి ఆందోళన కలిగించింది. దీంతో బెనిఫిట్ షోలపై మరింత కట్టుదిట్టమైన నియమాలు తీసుకొచ్చింది. అయినప్పటికీ, నిర్మాత దిల్ రాజు ప్రయత్నాలు కొంత ఫలితమిచ్చాయి. అనుకున్న రేంజ్ లో కాకపోయినా, ప్రత్యేక జీవో ద్వారా గేమ్ ఛేంజర్‌కు లభించిన మినహాయింపు కొంత ఊరట కలిగించిందని చెప్పొచ్చు. అయితే ఈ కఠిన నియంత్రణల కారణంగా గేమ్ ఛేంజర్ కలెక్షన్లపై ఎంతవరకు ప్రభావం పడుతుందో చూడాలి.

‘గేమ్ ఛేంజర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus