ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్రను ఎవరు పోషిస్తారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కథలో హీరోతో పాటు కొన్ని పాత్రలకు కీలక బాధ్యతలు ఇస్తారు. ఆ పాత్రల చుట్టూ కథ నడుస్తుంది. అత్తారింటికి దారేది సినిమాలో నదియా పోషించిన రోల్ అటువంటిదే. అజ్ఞాతవాసి లోను కుష్బూ కి కీలకరోల్ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేయనున్న సినిమాలోను ఇటువంటి పవర్ ఫుల్ రోల్ ఒకటి ఉందంట. ఈ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుందో త్రివిక్రమ్ టీమ్ సభ్యులు చర్చిస్తున్నారు. ముగ్గురు సీనియర్ హీరోయిన్స్ పేర్లు పరిశీలిస్తున్నారు. లయ, సిమ్రాన్, మీనాలను సంప్రదించాలని అనుకుంటున్నారు. వీరిలో ఎవరు నటించడానికి ఒప్పుకుంటారో త్వరలో తెలియనుంది.

తొలిసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తుండడంతో ఎన్టీఆర్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. పాత్ర కోసం బరువు తగ్గే పనిలో ఉన్నారు. బాలీవుడ్ ఫిట్ నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో వ్యాయామం చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన డీజే బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నారు. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus